వీళ్లంతా ఏం చేస్తున్నరో తెలుసా? డ్యాన్స్ చేస్తున్నరు. అవును, నిజంగానే డ్యాన్స్ చేస్తున్నరు. వెస్టర్న్ క్రిస్టియన్లు ఇపిఫనీ డే అనే ఓ పండుగ చేస్తరు. ఆ పండుగలో భాగంగానే ఇట్ల సల్లటి నీళ్లలోకి దిగి అందరూ కలిసి డ్యాన్స్ చేసిన్రు. బల్గేరియాలోని కలోఫర్లో జరిగిన ఉత్సవాల్లో భాగంగా టుంజా నదిలోకి దిగిన్రు. ఏసు క్రీస్తు పుట్టి, జనానికి కన్పించాడని అక్కడి వాళ్ల నమ్మకం. దాన్నే ఇపిఫనీ డే పేరిట వెస్టర్న్ దేశాల జనాలు ఏటా ఘనంగా ఉత్సవాలు చేసుకుంటరు. ఈ ఏడాది జనవరి 6న తీసిన ఫొటో ఇది.
