ఎమ్మెల్యేల సంతకం ఫోర్జరీ కేసులో.. అభిషేక్ బెనర్జీకి సీఐడీ నోటీసులు

ఎమ్మెల్యేల సంతకం ఫోర్జరీ కేసులో.. అభిషేక్ బెనర్జీకి సీఐడీ నోటీసులు

ఎమ్మెల్యే సంతకాల ఫోర్జరీ కేసులో విచారణ హాజరు కావాలని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ అభిషేక్ బెనర్జీకి క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ)  నోటీసులిచ్చింది.  జూన్ 1న  మధ్యాహ్నం 12 గంటలకు విచారణకు హాజరు కావాలని బెనర్జీని సీఐడీ కోరింది. నలుగురు సభ్యుల సీఐడీ టీం కోల్‌కతాలోని అభిషేక్ బెనర్జీ ఇంటికి వెళ్లి నోటీసులిచ్చింది. 

నోటీసులపై స్పందించిన అభిషేక్ బెనర్జీ.. బీజేపీ ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులపై కక్ష్య సాధింపుగా అధికార దుర్వినియోగం చేస్తుందని అన్నారు.గతంలో కూడా  చాలాసార్లు ఈడీ, సీబీఐల ముందు హాజరయ్యాను..ఇప్పుడు సీఐడీ దర్యాప్తుకు కూడా సహకరిస్తానని చెప్పారు అభిషేక్ బెనర్జీ. 

►ALSO READ | ఢిల్లీలో ఐఎస్ఐ ఉగ్ర కుట్ర భగ్నం..తొమ్మిది మంది అరెస్టు

ఎమ్మెల్యే సంతకం ఫోర్జరీ కేసు.. 

గతంలో సీనియర్ టీఎంసీ నేత శోభన్ దేవ్ చటోపాధ్యాయను ఫ్లోర్ లీడర్ గా నియమించేందుకు పశ్చిమ బెంగాల్  అసెంబ్లీ స్పీకర్ కు సమర్పించిన లేఖలో పలువురు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాలు ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.  అసెంబ్లీ సెక్రటేరియట్ ఇచ్చిన ఫిర్యాదుతో సీఐడీ విచారణ చేపట్టింది. దర్యాప్తులో భాగంగా ఇప్పటికే పలువురు టీఎంసీ ఎమ్మెల్యేలు, కునాల్ ఘోష్ తో సహా కొందరు టీఎంసీ నేతలకు సీఐడీ నోటీసులిచ్చింది.