
అయిజ, వెలుగు: ఓ సిగరెట్ ఏజెన్సీలో భారీగా సిగరెట్లు మాయమయ్యాయి. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. అయిజ మున్సిపాలిటీలోని మేడికొండ చౌరస్తాలో జయలక్ష్మి ఏజెన్సీ పేరుతో దుకాణం నిర్వహిస్తున్నారు. యజమాని వినయ్‌కుమార్ రోజులాగే శనివారం ఉదయం దుకాణం తెరిచేందుకు రాగా.. తాళాలు పగులగొట్టి ఉన్నాయి.
లోపలికి వెళ్లి చూడగా రూ.12 లక్షల విలువైన 20 సిగరెట్ కాటన్లు చోరీకి గురయ్యాయి. పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నలుగురు వ్యక్తులు ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించినట్లు ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు.