స్వయంవద : సినిమా రివ్యూ

స్వయంవద : సినిమా రివ్యూ

రివ్యూ: స్వయంవద

నటీనటులు – అనికా రావు, ఆదిత్య అల్లూరి, అర్చ‌నా కౌడ్లీ, పోసాని కృష్ణ ముర‌ళి, ధ‌న్ రాజ్,తదితరులు

కెమెరా:  వేణు ముర‌ళీధ‌ర్.వి,

సంగీతం: ర‌మ‌ణ‌.జీవి,

ఎడిటింగ్:  సెల్వ కుమార్,

నిర్మాత‌:  రాజా దూర్వాసుల‌,

క‌థ‌,మాట‌లు, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వం: వివేక్ వ‌ర్మ‌

కథ

తాను అనుకున్నది జరగాలని, ప్రతి ఒక్కరూ తనకు నచ్చినట్లు ఉండాలని కోరుకునే యువతి స్వయంవద (అనికారావు). ఆమెను తండ్రి విక్రమ్ రెడ్డి (లోహిత్ కుమార్) అల్లారుముద్దుగా పెంచుకుంటూ ఉంటాడు. తనకు ఏమాత్రం కోపం తెప్పించినా, వెకిలి వేషాలు వేసినా సహించదు స్వయంవద. వాళ్లకు అప్పటికప్పుడు బుద్ధి చెబుతుంటుంది. స్వయంవద తండ్రి విక్రమ్ రెడ్డి దగ్గర బినామీగా పనిచేస్తుంటాడు జెల్లా వెంకట్రాముడు (పోసాని కృష్ణ మురళి). ఇతని కొడుకు సుబ్బు (సుబ్బారావు ) (ఆదిత్య అల్లూరి) సినిమా హీరో అవుదామని ప్రయత్నిస్తుంటాడు. ఇది ఇంట్లో వాళ్లకు నచ్చదు. ఈ క్రమంలో స్వయంవద సుబ్బును చూసి ఇష్టపడుతుంది. తండ్రికి చెబితే వెంకట్రాముడుతో మాట్లాడి సంబంధం కుదర్చుకుంటాడు. అందరికీ పెళ్లి ఇష్టమైనా స్వయంవద అహం సుబ్బుకు నచ్చదు. దాంతో పెళ్లి వద్దని చెబుతాడు. తనకు ఏమాత్రం నచ్చని చిన్న విషయాలకే మండిపడే స్వయంవద…తనను పెళ్లికి నిరాకరిస్తే ఎలా స్పందించింది. ద్వితీయార్థంలో వచ్చే ప్రియంవద ఎవరు ఆమెకు, స్వయంవద కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటనేది మిగిలిన కథాంశం.

నటీనటుల పర్ఫార్మెన్స్:

స్వయంవద పాత్రలో అహంభావిగా అనికారావు బాగానే చేసింది.. ఆదిత్య అల్లూరి తన పాత్ర పరిధి మేరకు నటించాడు. ప్రతికూల ఆలోచనలు గల తండ్రిగా లోహిత్ కుమార్ ఆకట్టుకుంటే…కొడుకు కోసం తపించే తండ్రిగా పోసాని నటన రాణించాడు. ఆద్యంతం సాగే మూడు పాత్రల్లో ధన్ రాజ్ నటన నవ్వులు పూయిస్తుంది.

టెక్నికల్ వర్క్:

వేణు ముర‌ళీధ‌ర్.వి కెమెరా పనితనం బాగుంది..ర‌మ‌ణ‌.జీవి పాటలు, నేపథ్య సంగీతం ఫర్వాలేదు..సెల్వ కుమార్ ఎడిటింగ్ క్రిస్ప్ గా ఉంటే బాగుండేది..డైలాగులు ఫర్వాలేదనిపిస్తాయి.

విశ్లేషణ :

ప్రతికూల ఆలోచనలు మనిషిని ఎంతలా పతనం చేస్తాయో ఈ మూవీ లో చూపించారు దర్శకుడు వివేక్ వర్మ.. హారర్ సప్సెన్స్ అంశాలను వినోదంఎక్కడా తగ్గకుండా చూపించారు.. ఒక వైపు నవ్విస్తూనే ఓ సందేశంతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అనుకున్న పాయింట్ ఇంట్రస్టింగానే అనిపించినా.. కథనం విషయంలో పొరబడ్డాడు డైరెక్టర్. సెకండాఫ్ ఇంకా పకడ్బందీగా ఉండే బాగుండేదనిపించింది. ఈ స్టోరీ ఈ మధ్య వస్తున్న హార్రర్ థ్రిల్లర్ లాగే మొదలైనప్పటికీ.. ట్రీట్ మెంట్ కాస్త డిఫరెంట్ గా ఉంది. మంచి కాస్టింగ్, టైట్ స్క్రీన్ ప్లే ఉండి ఉంటే పూర్తి న్యాయం జరిగిఉండేది. డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ కావాలంటే ‘‘స్వయంవద ’’ ఈ వీక్ లో ట్రై చేయవచ్చు.