సమ్మర్ కు యాక్షన్ ప్లాన్ రెడీ చేయండి : టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి

సమ్మర్ కు యాక్షన్ ప్లాన్ రెడీ చేయండి :  టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి
  • ట్రాన్స్ ఫార్మర్ల ఫెయిల్యూర్లను తగ్గించాలి
  • 33 కేవీ ఇంటర్ లింకింగ్ పనులు స్పీడ్ గా చేయండి
  • వీడియో కాన్ఫరెన్స్ లో టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్​రెడ్డి

హనుమకొండ, వెలుగు: వచ్చే సమ్మర్ అవసరాలకు అనుగుణంగా పట్టణాల్లో విద్యుత్ లోడ్ పెరుగుదల అంచనా మేరకు యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు. వచ్చే నెల15లోగా హెచ్ టీ సర్వీసులకు ఆటోమెటిక్ మీటర్ రీడింగ్(ఏఎంఆర్) ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఇకపై కొత్తగా రిలీజ్ చేసే సర్వీసులు కూడా ఏఎంఆర్ ద్వారా పర్యవేక్షణలోకి తేవాలని పేర్కొన్నారు. 

 హనుమకొండ నక్కలగుట్టలోని విద్యుత్ భవన్ లో సోమవారం ఎన్పీడీసీఎల్ పరిధి 17 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలు, ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ట్రాన్స్ ఫార్మర్ల ఫెయిల్యూర్లను తగ్గించాలని, విద్యుత్ సబ్ స్టేషన్ల రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ పనులు పెండింగ్ లేకుండా చూడాలని ఆదేశించారు.  ప్రతి డివిజన్ లో హై లాస్ ఫీడర్లను గుర్తించి, నష్టాలకు కారణాలను విశ్లేషించాలని చెప్పారు.

  పెండింగ్ లోని 33 కేవీ ఇంటర్ లింకింగ్ పనులు వేగంగా పూర్తి చేయాలని, టీజీ ఐపాస్, నాన్ టీజీ ఐపాస్ దరఖాస్తులు పెండింగ్ లో లేకుండా చూడాలని పేర్కొన్నారు. ఈ  సమావేశంలో డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, సీఈలు టి.సదర్ లాల్, కె.రాజుచౌహాన్, అశోక్, వెంకటరమణ, అన్నపూర్ణ, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.