వృషభ డబ్బింగ్ సినిమా కాదు బన్నీ వాస్

వృషభ డబ్బింగ్ సినిమా కాదు బన్నీ వాస్

మలయాళ స్టార్ మోహన్ లాల్ లీడ్‌‌‌‌ రోల్‌‌‌‌లో  సమర్జీత్ లంకేష్, నయన్ సారిక జంటగా  నంద కిషోర్ రూపొందించిన చిత్రం   ‘వృషభ’.  ఫాంటసీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని  కనెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిలిమ్స్‌‌‌‌తో క‌‌‌‌లిసి అభిషేక్ వ్యాస్ స్టూడియోస్   నిర్మించింది. డిసెంబర్ 25న విడుదల కానుంది.  గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ తెలుగులో రిలీజ్ చేస్తోంది.  

 సోమవారం హైదరాబాద్‌‌‌‌లో ప్రీ రిలీజ్ ప్రెస్‌‌‌‌మీట్ నిర్వహించారు.  ఈ సందర్భంగా  సమర్జీత్ లంకేష్ మాట్లాడుతూ ‘ఇదొక బిగ్గెస్ట్ యాక్షన్ ఫిలిం.  అలాగే లవ్ స్టోరీతో పాటు ఫాదర్ అండ్ సన్ మధ్య ఎమోషన్ కూడా   ఉంటుంది. మోహన్ లాల్ గారితో నటించడం గ్రేట్ ఎక్స్‌‌‌‌పీరియెన్స్’ అని చెప్పాడు.  ఇంత భారీ చిత్రంతో మలయాళ ఎంట్రీ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని, ఈ సినిమాలో ప్రతి పాత్రకు మంచి ఇంపార్టెన్స్ ఉంటుందని నయన్ సారిక చెప్పింది.

 ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ బన్నీ వాస్ మాట్లాడుతూ ‘ఈ సినిమా విజువల్స్ గ్రాండ్‌‌‌‌గా ఉంటాయి.  కింగ్ ఎపిసోడ్ వచ్చినప్పటి నుంచి సినిమా మరో స్థాయికి వెళ్తుంది. ఫైట్స్, ఎమోషనల్ కంటెంట్ కూడా బాగుంటుంది.  మోహన్ లాల్ గారి  సినిమాను రిలీజ్ చేసే అవకాశం మాకు ఇచ్చినందుకు సంతోషంగా ఉంది.  ఇది డబ్బింగ్ మూవీ కాదు. అన్ని భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా దీన్ని  రూపొందించారు’ అని చెప్పారు. ఈ చిత్రంలో నటించిన  నటులు అలీ,  బలగం సంజయ్ తదితరులు పాల్గొన్నారు.