ఆపరేషన్ సిందూర్ టైమ్ లో దేవుడు సాయం చేశాడు.. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్

ఆపరేషన్ సిందూర్ టైమ్ లో దేవుడు సాయం చేశాడు..    పాక్  ఆర్మీ చీఫ్ ఆసిమ్  మునీర్

ఇస్లామాబాద్: భారత్ చేపట్టిన ‘ఆపరేషన్  సిందూర్’ సమయంలో తమ భద్రతా బలగాలకు దేవుడి సహాయం అందిందని పాకిస్తాన్  ఆర్మీ చీఫ్  ఫీల్డ్ మార్షల్ ఆసిమ్  మునీర్  పేర్కొన్నారు. యుద్ధ క్షేత్రంలో దైవ సహాయాన్ని తాము ఫీల్ అయ్యామన్నారు. ఇటీవల ఇస్లామాబాద్​లో నిర్వహించిన నేషనల్  ఉలేమా కాన్ఫరెన్స్​లో ఆయన మాట్లాడారు. ఆ స్పీచ్​ను ఆదివారం పాక్​లో కొంతవరకు మాత్రమే టెలికాస్ట్  చేశారు. పహల్గాం టెర్రర్  అటాక్ కు ప్రతీకారంగా పాక్ తో పాటు పాక్  ఆక్రమిత కాశ్మీర్​లోని ఉగ్రవాద స్థావరాలపై భారత బలగాలు దాడి చేశాయి. ఈ ప్రతీకార దాడిలో ఉగ్రవాద స్థావరాలు తునాతునకలయ్యాయి. నాలుగు రోజులు ఇరు దేశాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే.