ఇంటిపేరునే రౌడీగా మార్చుకున్నోడు

ఇంటిపేరునే రౌడీగా మార్చుకున్నోడు

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘రౌడీ జనార్థన’.  కీర్తి సురేష్ హీరోయిన్. రవి కిరణ్ కోలా దర్శకుడు.  దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. సోమవారం ఈ మూవీ టైటిల్‌‌‌‌ గ్లింప్స్‌‌‌‌ను విడుదల చేశారు. ఊరి నడిబొడ్డున, అర్థరాత్రి ఎగిసిపడుతున్న మంటల మధ్య, పదుల సంఖ్యలో శత్రువులు చుట్టుముట్టగా చేతిలో వేట కత్తి,  కండలు తిరిగిన దేహంతో వారిని ఎదిరిస్తూ కనిపించాడు విజయ్ దేవరకొండ. ‘‘ఈ కళింగపట్నంలో ఇంటికొకడు నేను రౌడీని అని చెప్పుకు తిరుగుతాడు.. కానీ ఇంటిపేరునే రౌడీగా మార్చుకున్నోడు ఒక్కడే ఉన్నాడు.. జనార్థన.. రౌడీ జనార్థన” అంటూ విజయ్ చెప్పిన డైలాగ్‌‌‌‌ గ్లింప్స్‌‌‌‌కు హైలైట్‌‌‌‌గా నిలిచింది. 

 పూర్తిస్థాయి మాస్‌‌‌‌, యాక్షన్‌‌‌‌ కంటెంట్‌‌‌‌తో సినిమా రాబోతోందని అర్థమవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌లో దిల్ రాజు మాట్లాడుతూ ‘ఔట్ అండ్ ఔట్ మాస్ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లో విజయ్ కనిపించబోతున్నాడు. ఇంత మాస్, బ్లడ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ అతను  ఇంతవరకూ చేయలేదు. ఈస్ట్ గోదావరి యాసలో విజయ్ మాట్లాడటం ఈ స్టోరీ విన్నప్పుడు నాకు యూనిక్‌‌‌‌గా అనిపించింది. ఎయిటీస్‌‌‌‌ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లోని వరల్డ్‌‌‌‌ను చాలా బాగా క్రియేట్ చేశారు. రవికిరణ్ విజన్‌‌‌‌లోని కొత్తదనాన్ని తెరపైకి తెచ్చేందుకు టెక్నికల్‌‌‌‌ టీమ్ అంతా కష్టపడుతున్నారు’ అని చెప్పారు.

 డైరెక్టర్ రవికిరణ్ కోలా మాట్లాడుతూ ‘స్టోరీ చెప్పగానే విజయ్ ఇన్‌‌‌‌స్టంట్‌‌‌‌గా ఆ పాత్రను ఓన్ చేసుకున్నారు. షూట్‌‌‌‌లో ఈస్ట్ గోదావరి యాసలో ఆక్యురేట్‌‌‌‌గా డైలాగ్స్‌‌‌‌ చెప్పారు. చాలా కాన్ఫిడెంట్ గా అనిపించింది. మా టీమ్ మెంబర్స్ ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు’ అన్నాడు.   టైటిల్ గ్లింప్స్ చిన్న శాంపిల్ మాత్రమేనని ముందు ముందు మరింత ఎక్సయిటింగ్‌ కంటెంట్ రాబోతోందని డీవోపీ ఆనంద్‌‌‌‌ సి చంద్రన్, ప్రొడక్షన్ డిజైనర్ డినో శంకర్ చెప్పారు.