కారు బాంబు పేలి రష్యా సైనికాధికారి మృతి..మాస్కోలో ఘటన.. ఉక్రెయిన్ పై డౌట్

కారు బాంబు పేలి రష్యా సైనికాధికారి మృతి..మాస్కోలో ఘటన.. ఉక్రెయిన్ పై డౌట్

మాస్కో: రష్యాలోని మాస్కోలో కారు బాంబు పేలి సైనికాధికారి ఒకరు​చనిపోయారు.  ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ ఫానిల్ సర్వరోవ్‌‌‌‌‌‌‌‌(56).. రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ జనరల్ స్టాఫ్‌‌‌‌‌‌‌‌లోని ఆపరేషనల్ ట్రైనింగ్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్​గా విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం ఆయన మాస్కోలోని యాసెనెవాయా స్ట్రీట్‌‌‌‌‌‌‌‌లో ఉన్న అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ పార్కింగ్ నుంచి తన కారును డ్రైవ్ చేస్తూ బయలుదేరారు. కొద్దిసేపటికే కారు పేలిపోవడంతో ఫానిల్ సర్వరోవ్‌‌‌‌‌‌‌‌ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఘటనపై అధికారులు కేసు నమోదు చేశారు. ఫోరెన్సిక్ నిపుణులు ఘటనాస్థలంలో ఆధారాలు సేకరిస్తున్నారు. పోలీసులు సాక్షుల వాంగ్మూలాలను తీసుకుని సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. కారు పేలుడుకు ఉక్రేనియన్ స్పెషల్ ఫోర్సెస్​తో సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.