సినీపొలిస్ , పనోరమా స్టూడియోస్ జోడీ

సినీపొలిస్ , పనోరమా స్టూడియోస్ జోడీ

హైదరాబాద్​, వెలుగు: సినిమా ప్రదర్శన సంస్థ  సినీపొలిస్  ఇండియా, పనోరమా స్టూడియోస్ సంస్థలు ఢిల్లీ, యూపీ సర్క్యూట్ కోసం వ్యూహాత్మక పంపిణీ భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. థియేట్రికల్ వ్యవస్థను బలోపేతం చేయడం, ప్రాంతీయ ప్రేక్షకుల పరిధిని పెంచడం ఈ ఉమ్మడి భాగస్వామ్యం ముఖ్య ఉద్దేశం. ఈ సహకారం ఇప్పటికే ధమాల్ 4, బేబీ డో డై డో వంటి చిత్రాల డిస్ట్రిబ్యూషన్‎తో ప్రారంభమైంది. దీనిని కొనసాగిస్తూ శుక్రవారం మహాప్రభు జగన్నాథ్, ఈ నెల 31న హనుమాన్ అంశ్​ చిత్రాలను విడుదల చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ పంపిణీ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌ను మరిన్ని అదనపు ప్రాంతాలకు విస్తరించాలని రెండు సంస్థలు కోరుకుంటున్నాయి.