
హైదరాబాద్, వెలుగు: భారతదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ సినిమా ఎగ్జిబిటర్ అయిన సినీపోలిస్ హైదరాబాద్‌లోని లులు మాల్‌లో తన సరికొత్త మల్టీప్లెక్స్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇందులోని ఐదు స్క్రీన్‌లలో1,427 సీట్లు ఉంటాయి. సినీ ప్రేక్షకులు తమ అభిమాన సినిమాలను ఆస్వాదించడానికి ఇమ్మర్సివ్ రియల్‌డి 3డీ, డాల్బీ ఆట్మోస్ సరౌండ్ సౌండ్ టెక్నాలజీలు ఉంటాయి. సినీపోలిస్కు సిటీలో 5 ప్రాపర్టీల్లో 27 స్క్రీన్లు ఉన్నాయి.