వాటర్​ ఫాల్స్​ను చూసొద్దాం..

వాటర్​ ఫాల్స్​ను చూసొద్దాం..

విజయ్ సాఫ్ట్​వేర్ ఎంప్లాయ్.  ఎప్పుడూ ఆఫీసు పనిలో బిజీగా ఉంటాడు.  వీకెండ్స్ లో వీలైనప్పుడు  ఇంటికి వెళ్లి వస్తుంటాడు. సెలవుల్లో సిటీలో తిరగడం లేదా ఇంటికి వెళ్లడం రొటీన్​గా అనిపించింది అతడికి.  వీకెండ్స్​లో కొత్త చోటుకి వెళ్లాలనుకున్నాడు. తనతో పాటు ట్రావెలింగ్​కు రావాలని కొలిగ్స్​ను అడిగాడు. ఎవరూ రెస్పాండ్ కాలేదు. అదే టైమ్​లో ఓ ఫ్రెండ్​ ‘మీటప్స్​’ గురించి విజయ్ కు చెప్పాడు. తనలా వీకెండ్స్​లో రెండు, మూడ్రోజులు ట్రావెలింగ్​ చేద్దాం అనుకునే వారి కోసం మీటప్  ఫ్రెండ్స్​ గ్రూప్​లు ఉన్నాయని వివరించాడు. మీటప్స్ గ్రూప్స్ నిర్వాహకులు టూర్లకు తీసుకెళ్లడంతో పాటు మంచి గైడ్ గా కూడా పనిచేస్తారని తెలుసుకున్న విజయ్ వెంటనే అందులో జాయిన్ అయ్యాడు.  కొత్త వాళ్లతో సరదాగా ట్రిప్ కు వెళ్లివచ్చాడు. ఎప్పుడూ ఫ్రెండ్స్, తెలిసిన వాళ్లతోనే కాకుండా కొత్తవాళ్లతో గ్రూప్ గా టూర్​కు వెళ్లడం డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ను ఇచ్చిందని విజయ్ చెబుతున్నాడు.

హైదరాబాద్, వెలుగు: ఫ్రెండ్స్​తో టూర్​ వెళ్లాలంటే ఏ సీజన్​ అయినా అనుకూలమే. అది మాన్​సూన్​ అయితే మరింత క్రేజ్​ ఉంటుందని అంటున్నారు యంగ్​ట్రావెల్ బర్డ్స్.  అందుకే  వానాకాలం రావడంతోనే సిటీ నుంచి మాన్​సూన్​ ట్రిప్స్​ కూడా మొదలయ్యాయి. సిటీ  శివారు ప్రాంతాలతో పాటు, బార్డర్​ స్టేట్స్​ లో ఉంటే టూరిస్ట్​ స్పాట్లకు వీకెండ్​ ప్లాన్లు వేసుకుంటున్నారు యువతీ యువకులు. ఇలాంటి యువత కోసం టూర్స్ అండ్ ట్రావెల్స్ తో పాటు ఇటీవలి కాలంలో పలు స్టార్టప్‌‌లు కూడా ప్రారంభమయ్యాయి. బడ్జెట్​ ఫ్రెండ్లీ ప్యాకేజీలతో నిర్వాహకులు ట్రావెలర్స్​ను టూర్లకు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో వీకెండ్​ ట్రిప్​లకు మంచి డిమాండ్​ కూడా పెరిగింది.  సిటీ నుంచి  రెండు మూడ్రోజుల్లో  చుట్టొచ్చే ప్లేస్‌‌లకు సిటీవాసుల నుంచి ఎక్కువ రెస్పాన్స్ వస్తోందని టూర్ స్టార్టప్‌‌ల నిర్వాహకులు అంటున్నారు. కొవిడ్ తర్వాత ట్రావెలింగ్ పై జనాల ఫోకస్ పెరిగిందని అంటున్నారు. వానాకాలం మొదలయ్యాక ఇప్పటివరకూ ఒక్కో టూర్ సంస్థ నుంచి వందమందికి పైగా ట్రావెలర్స్ ని తీసుకెళ్లినట్లు ఫౌండర్‌‌‌‌లు చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో సోలో ట్రావెలింగ్ చేసేవాళ్లు కూడా పెరుగుతున్నారు. దీంతో పది, పదిహేను మందిన గ్రూప్‌‌ గా క్రియేట్ చేసి టూర్‌‌‌‌లకు తీసుకెళ్తున్నారు. 
 

ట్రెక్కింగ్, వాటర్‌‌‌‌ ఫాల్స్‌‌కు..
ఇటీవల కురిసన వర్షాలకు ప్రస్తుతం సిటీ శివార్లలోని వాటర్ ఫాల్స్ అన్నీ ఆకట్టుకుంటున్నాయి. సిటీకి 200 కి.మీల  పరిధిలో ఉన్న వాటర్ ఫాల్స్ ను చూసేందుకు సిటిజన్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బోయకొండ వాటర్ ఫాల్స్, బొగత, పొచ్చెర, మల్లెలతీర్థం,  కనకాయ్, భీముని పాదం జలపాతాలకు టూరిస్టుల  తాకిడి ఎక్కువ ఉంది.  అలాగే సరిహద్దు రాష్ట్రమైన కర్ణాటకలోని చిక్ మంగుళూరు, హంపి, ఉడిపి, గోకర్ణ, మురుదేశ్వర్, బడామి, నాగర్ హోల్ నేషనల్ పార్క్, కాబిని వంటి ప్రదేశాలకు సిటీ నుంచి వీకెండ్స్​లో వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉందని మీటప్ నిర్వాహకులు చెప్తున్నారు.  రాజ్‌‌ గఢ్, టోర్నా ఫోర్ట్, టోర్నా వాటర్‌‌‌‌ఫాల్స్, మహారాష్ట్రలోని విసాపూర్ ఫోర్ట్, స్టెప్ వాటర్‌‌‌‌ఫాల్స్, లోహ్గడ్ కోట, సుధా గఢ్ కోట, భీరా డ్యామ్, దేవ్‌‌కుండ్ వాటర్‌‌‌‌ఫాల్స్, రాజ్‌‌మచి ఫోర్ట్, కోటల్‌‌దారా ఫాల్స్ వ్యూ పాయింట్, కొండనా కేవ్ వాటర్‌‌‌‌ఫాల్స్ కి సిటీ నుంచి ప్యాకేజీల ద్వారా ఎక్కువ మంది వెళ్తున్నారు. 
 

త్రీ డేస్ ట్రిప్స్..
వీకెండ్ ట్రిప్‌‌ లకే  ఇప్పుడు ఎక్కువ క్రేజ్ ఉందని టూర్ స్టార్టప్ ల నిర్వాహకులు చెప్తున్నారు. సోలో  ట్రావెల్‌‌ చేయాలనుకునేవారితో పాటు ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా వీటినే ఎక్కువగా ఎంచుకుంటున్నారు.  ప్రస్తుతం టూర్‌‌‌‌ స్టార్టప్‌‌లు వెబ్‌‌ సైట్‌‌తో పాటు ఇన్‌‌స్టా గ్రామ్ పేజ్ లలో అందుబాటులో ఉంటున్నాయి. ట్రావెల్ చేయాలనుకునే వారు స్టార్టప్​ నిర్వాహకులను సంప్రదిస్తే..  ఎంచుకున్న ప్యాకేజీ ట్రిప్​ను బట్టి వాళ్లే తీసుకెళ్తారు. ఈ వీకెండ్ ట్రిప్స్ కు 4,500 నుంచి రూ. 5 వేల వరకు ప్యాకేజీలుంటాయి. వీటిలోనే ట్రైన్ టికెట్స్, డెస్టినేషన్ రీచ్ అయ్యాక బస్, హోమ్‌‌స్టే, ట్రెక్కింగ్, సైట్ సీయింగ్, ఎంట్రీ టికెట్స్, టిఫిన్‌‌, డిన్నర్ వంటివి కల్పిస్తున్నారు. ట్రావెలర్స్ తో పాటు ఒక లోకల్ గైడ్, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ కూడా అందుబాటులో ఉంటుంది. శుక్రవారం రాత్రి మొదలైన టూర్ సోమవారం సిటీకి రీచ్ అవడంతో ముగుస్తుంది. ఫేమస్ ప్లేస్‌‌లతో పాటు వాటి చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రాంతాలను కూడా కొన్ని స్టార్టప్‌‌లు తమ ట్రావెలర్లకు చూపిస్తున్నాయి.


కుంటాల వాటర్ ఫాల్స్ చూసొచ్చాం.. 
లాస్ట్ వీకెండ్ నేను నా కొలిగ్స్ తో కలిసి బొగత వాటర్ ఫాల్స్ కి వెళ్లాం. మాది టూ డేస్  ట్రిప్. శుక్రవారం ఆఫీస్ అయ్యాక ట్రైన్‌‌లో వెళ్లాం. ఫారెస్ట్ లో నుంచి ట్రావెలింగ్ థ్రిల్లింగ్ గా అనిపించింది.  కుంటాల వాటర్ ఫాల్స్ చూశాం. మరుసటి రోజు బాసర టెంపుల్‌‌ కి వెళ్లి దర్శనం చేసుకుని రిటర్న్ అయ్యాం. వర్షంలో ట్రావెల్ చేయడం  బాగా అనిపించింది.                                                                                                    - క్రిస్టల్, ప్రైవేటు ఎంప్లాయ్, బేగంపేట

 ప్రతి వీకెండ్ ఒక ట్రిప్..
ట్రావెల్ స్టార్టప్​ను 2019లో స్టార్ట్ చేశాం. లాక్ డౌన్ తర్వాత ట్రావెలింగ్ చేస్తున్న వాళ్లు పెరిగారు. మాన్ సూన్ మేనియా పేరుతో రూ.5 వేల ప్యాకేజీలతో వీకెండ్ ట్రిప్​లను మొదలుపెట్టాం. ఇప్పటివరకు వందమందికిపైగా ట్రావెలర్స్ ను ట్రిప్స్ కు తీసుకెళ్లాం. ప్రతి వీకెండ్​లో 10 నుంచి 15 మందితో ఒక గ్రూప్‌‌ క్రియేట్ చేసి తీసుకెళ్తున్నాం. టూర్‌‌‌‌ ప్లేస్​కి వెళ్లిన తర్వాత  హోమ్‌‌స్టేలను ఏర్పాటుచేస్తున్నాం. అక్కడివాళ్ల కల్చర్, ఫుడ్ ట్రావెలర్స్​కు మంచి ఎక్స్‌‌పీరియన్స్ ఇస్తుంది. ట్రెక్కింగ్, కోటలు, వాటర్‌‌‌‌ఫాల్స్ జనాలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందులో ట్రిప్‌‌లో వాటిని మిక్స్ చేసి పెడుతున్నాం. 
                                                                                                                                                                                            - కార్తీక్, ట్రావెల్ స్టార్టప్ నిర్వాహకుడు