
పౌరసత్వ సవరణ చట్టం ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. భారతీయ జనతా పార్టీకి కులమత భేదాలు లేవన్నారు. పెద్దపల్లిలో పౌరసత్వ చట్టంకు మద్దతుగా జాతీయ వాదుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీని ప్రారంభించారు మాజీఎంపీ వివేక్ వెంకటస్వామి.
బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ రావుతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహం నుంచి జెండా చౌరస్తా వరకు 200 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. సీఏఏ పై ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు వివేక్ వెంకటస్వామి.