ట్రాన్స్ పోర్టు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి : సీఐటీయూ

ట్రాన్స్ పోర్టు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి : సీఐటీయూ

ఆలిండియా రోడ్ ట్రాన్స్ పోర్టు వర్కర్స్ ఫెడరేషన్ డిమాండ్

ముషీరాబాద్, వెలుగు : రాష్ట్ర వ్యాప్తంగా రవాణా రంగంలో ఉపాధి పొందుతున్న 20 లక్షల మంది సంక్షేమ కోసం ప్రభుత్వం ట్రాన్స్​పోర్టు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్ పోర్టు వర్కర్స్ ఫెడరేషన్(సీఐటీయూ) డిమాండ్ చేసింది. ఫెడరేషన్​గ్రేటర్​హైదరాబాద్​సెంట్రల్​కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఇందిరా పార్క్ ధర్నాచౌక్ లో దీక్ష చేపట్టింది. మోటార్ వెహికల్ యాక్ట్ 2019ను సవరించాలని డిమాండ్​చేసింది. ఈ సందర్భంగా ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ.. దేశ జీడీపీలో 4 శాతాన్ని అందిస్తున్న రవాణా రంగాన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. ఏదైనా ప్రమాదం జరిగి గాయాలపాలైతే ఆదుకునే దిక్కు ఉండడం లేదని వాపోయారు.

రవాణా రంగంలోని కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ట్రాన్స్​పోర్టు కార్మికులకు యాక్సిడెంట్​బెనిఫిట్స్, మెడికల్​హెల్ప్, కార్మికుల పిల్లల చదువులకు స్కాలర్షిప్ లు ఇస్తున్నారని గుర్తుచేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి, సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. దీక్షలో ఫెడరేషన్ కార్యదర్శి అజయ్ బాబు, కలీం, ఉమేశ్​రెడ్డి, గౌస్, సురేశ్, మహేశ్, జునైద్, ఆర్బుస్ ఖాన్, ఇమ్రాన్, అనీఫ్ తదితరులు పాల్గొన్నారు.