హైదరాబాద్, వెలుగు: గణేశ్ఉత్సవాల ఏర్పాట్లపై సిటీ పోలీస్‌కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి శనివారం సమీక్ష జరిపారు. బంజారాహిల్స్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో భాగ్యనగర్ గణేశ్ఉత్సవ సమితి, ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి సభ్యులు, మూడు కమిషనరేట్ల పోలీస్ అధికారులతో కో ఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ, ఎలక్ట్రిసిటీ, ఆర్టీసీ, రెవెన్యూ, ఆర్అండ్‌బీ, ట్రాన్స్‌పోర్ట్, హెల్త్, హెచ్‌ఎండీఏ సహా అన్ని డిపార్ట్‌మెంట్ల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీపీ శ్రీనివాస్‌రెడ్డి గణేశ్ఉత్సవ సమితి సభ్యులకు పలు సూచనలు చేశారు. ఉత్సవాల నిర్వహణలో హైకోర్టు ఆదేశాలు పాటించాలని చెప్పారు. మండపాల సమాచారాన్ని తప్పనిసరిగా స్థానిక పోలీసులకు అందించాలని సూచించారు. నిమజ్జనం రోజు రాత్రి తీసుకోవాల్సిన చర్యలు గురించి వివరించారు. ఎలాంటి సమస్యలు ఉన్నా సంబంధిత అధికారులకు తెలపాలన్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. ఉత్సవ సమితి సభ్యుల నుంచి సలహాలు సూచనలు తీసుకున్నారు.