సిటీలో పెరిగిన డ్రగ్స్ దందా

సిటీలో పెరిగిన డ్రగ్స్ దందా

ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య డ్రగ్స్. మత్తు పదార్థాలకు బానిసైన యూత్, స్టూడెంట్స్ తమ ఫ్యూచర్ ను స్పాయిల్ చేసుకుంటున్నారు. డ్రగ్స్ కట్టడికి, యూత్ అటువైపు మళ్లకుండా పోలీసులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా కాలేజీల్లో యాంటీ డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. సదస్సులు, సెమినార్లు నిర్వహించి మత్తు పదార్థాల వాడకంతో ఎదురయ్యే అనర్థాలు వివరించి అవేర్ నెస్ కల్పించనున్నారు.

డ్రగ్స్ కంట్రోల్ పై స్పెషల్ ఫోకస్

గత కొన్ని రోజులుగా సిటీ పోలీసులు డ్రగ్స్ కంట్రోల్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ముంబై, గోవాల నుంచి హైదరాబాద్ కి డ్రగ్స్ తరలించే వారిని పట్టుకుంటున్నారు. సిటీలో ఏజెంట్స్ ఎక్కువగా డ్రగ్స్ అమ్మేది స్టూడెంట్స్ కేనని పోలీసులు గుర్తించారు. సిటీలోని డ్రగ్ తీసుకునేవారిలో 50 శాతానికి పైగా కాలేజ్ స్టూడెంట్సేనని చెప్తున్నారు. కొరియర్స్ తో, చాక్లెట్స్, చాకో లావాలతో స్టూడెంట్స్ డ్రగ్స్ తీసుకుంటున్నారు. స్పెషల్లీ వీకెండ్స్ పార్టీస్, కాలేజ్ పార్టీస్, ట్రిప్స్ లో స్టూడెంట్స్ ఎక్కువగా డ్రగ్స్ ని కన్జ్యూమ్ చేస్తున్నారని పోలీసులు చెప్తున్నారు. వీటికి చెక్ పెట్టేందుకే ఈ యాంటీ డ్రగ్స్ కమిటీలను ప్రతీ కాలేజ్ లో ఏర్పాటు చేస్తున్నామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.

కాలేజీల్లో యాంటి డ్రగ్స్ కమిటీలు

క్షేత్రస్థాయిలో డ్రగ్స్ ను నిర్మూలించడానికే యాంటి డ్రగ్స్ కమిటీలను కాలేజీల్లో ఏర్పాటు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఇందుకోసం వివిధ కాలేజీలు, విద్యా సంస్థల యాజమాన్యాలు యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కమిటీల్లో స్టూడెంట్స్, లెక్చరర్స్ తో కలిపి మొత్తం ఐదుగురు సభ్యులుండాలని సూచించారు. పోలీసుల ఆదేశాలతో కమిటీలు ఏర్పాటు చేస్తున్నాయి కాలేజీ యాజమాన్యాలు. డిజిటల్ ప్లాట్ ఫామ్స్ అవగాహన కల్పించడం, సెమినార్స్ తో డ్రగ్స్ తీసుకుంటే కలిగే ప్రమాదాలను వివరించనున్నారు. కాలేజ్ లో జరిగే ప్రోగ్రామ్స్ లో డ్రగ్స్ అవేర్నెస్ పై కార్యక్రమాలు నిర్వహించాలని పోలీసులు సూచిస్తున్నారు. దీంతో పాటు కాలేజ్ ట్రిప్స్, ఫంక్షన్స్, పార్టీస్ లో డ్రగ్స్ వాడకంపై స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు. ఏదైనా అనుమానం వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వడం కమిటీ సభ్యుల ప్రధాన విధి.

డ్రగ్స్ వాడకంతో జరిగే అనర్దాలపై అవగాహన

విద్యా సంవత్సరం ప్రారంభంలోనే డ్రగ్స్ వాడకంతో జరిగే అనర్దాలపై అవగాహన కల్పించడానికి పేరెంట్స్, స్టూడెంట్స్, ఫ్యాకల్టీ, వివిధ ఏజెన్సీలు, పోలీసుల సహకారంతో కాలేజీల మేనేజ్మెంట్స్ ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలని పోలీసులు చెప్తున్నారు. ఈ కమిటీలు డ్రగ్స్ వినియోగం, అమ్మకాలకు సంబంధించిన సమాచారాన్ని స్థానిక పోలీసులతో పాటు హైదరాబాద్  నార్కొటిక్స్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ కు సమాచారం ఇవ్వాలని సూచించారు.