
సాధారణంగా 60 ఏళ్లు దాటిన తరువాత మెదడు పనితీరు బలహీనపడుతుంది. దీంతో మతిమరుపు వస్తుంది. జ్ఞాపకశక్తి లోపించి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే హైటెక్ యుగంలో వృద్దుల్లోనే కాదు యువతలో కూడా జ్ఞాపకశక్తి లోపిస్తుంది. కాని ఈ మధ్యకాలంలో పదేళ్లకే ప్రతి విషయాన్ని మర్చిపోతున్నారు.మతిమరుపు నుండి బయటపడేందుకు నిపుణులు కొన్ని పరిష్కారమార్గాలను సూచించారు.
మతిమరుపు ఇది చాలా ప్రమాదకరం.. చేయాల్సిన పనులు గుర్తుండకపోవడం.. ఉప్పు కొందామని షాపునకు వెళితే పప్పు కొనడం ఇలా అనేకం జరుగుతుంటాయి. చిన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోలేకపోతున్నారు. ... అనుకున్న పని అనుకున్నప్పుడే చేయకపోతే మర్చిపోతున్నా" "వస్తువు కోసం గదిలోకి వెళ్లాక, ఎందుకు వెళ్లానో మర్చిపోతున్నా" అంటూ మతిమరుపు గురించి చెప్పేవాళ్లు ఎక్కువైపోతున్నారు.
మనదేశంలోనూ మతి మరుపు సమస్యతో బాధపడేవాళ్లు రోజురోజుకూ పెరుగుతున్నారని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. అలాగని అందరికీ అల్జీమర్ ఉన్నట్లు కాదు. మర్చిపోవడానికి చాలా కారణాలుంటాయి.
పని ఒత్తిడి, నిద్ర సరిగ్గా లేకపోవటం, అనారోగ్యం, మితిమీరిన ఆలో చనలు. వ్యక్తిగత జీవితం... వంటివి. అయితే, ఒక్కోసారి బతుకుబండి సరిగా నడుస్తున్నా మతిమరుపు వేధిస్తుంటుంది. అందుకు అనేక కారణాలున్నాయని చెప్తున్నారు మానసిక నిపుణులు. కొందరు చేసే పనిలో సంతోషాన్ని పొందుతుంటారు. కానీ కూర్చొన్న చోట నుంచి లేవకుండా పనిచేస్తుంటారు. దాంతో శరీరం కదలదు. ఒకేచోట ఉండిపోతుంది. అలా పనిచేసే వాళ్ల మెదడుకు ఆక్సిజన్ సరిగ్గా అందదు. అలసట వస్తుంది.
మనసుకు విశ్రాంతి ఇవ్వకపోవటం వల్లే మతిమరుపు వస్తుందని పలు అధ్యయనాల్లో తేలింది. అందుకే ఆఫీసులో అయినా.... ఇంట్లో అయినా పని మధ్యలో మెదడుకు విశ్రాంతి ఇవ్వాలి. కంప్యూటర్, సెల్ ఫోన్లకు వీలైనంత దూరంగా ఉండాలి.
నడక లాంటి చిన్నచిన్న వ్యాయామాలు చేయాలి శ్వాసకు సంబంధించిన ఎక్సర్ సైజ్ లు చేయడం వల్ల కూడా మెదడుకు ఆక్సిజన్ బాగా అందుతుంది. మతి మరుపు వస్తుందని బాధపడే కన్నా రోజువారీ జీవితంలో ఇలాంటి చిన్నచిన్న మార్పులు చేసుకుంటే మతిమరుపును సులభంగా పోగొట్టుకోవచ్చు