health alert: ఇండియాలో ఇంత ఎండ ఉన్నా.. విటమిన్D లోపం ఎందుకు వస్తుంది?

health alert: ఇండియాలో ఇంత ఎండ ఉన్నా.. విటమిన్D లోపం ఎందుకు వస్తుంది?

మనదేశంలో ఎండలు బాగా ఉంటాయి. ఎండాకాలం అయితే సాధారణానికి మించి ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి.. సూర్యరశ్మి సమృద్ధిగా ఉన్నప్పటికీ ప్రతి 10 మందిలో 9 మంది విటమిన్​ D లోపంతో  బాధపడుతున్నారు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో విటమిన్ D కీలకం. భారత్​ లో పుష్కళంగా సూర్యరశ్మి దొరుకుతున్నా ఎందుకు విటమిన్​ D లోపం ఉంది?.. అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే.. 

విటమిన్ D..విటమిన్ కంటే హార్మోన్ లాగా బాగా పనిచేస్తుంది. ఇది శరీరం కాల్షియంను గ్రహించడంలో సహాయపడుతుంది.ఎముకలను బలపరుస్తుంది. రోగనిరోధక శక్తిని ,మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. విటమిన్​ D లోపించినప్పుడు  అలసట, తక్కువ మానసిక స్థితి, కండరాల నొప్పి,తరచుగా అనారోగ్యం పాలవుతుంటారు. 
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) ప్రకారం..70నుంచి90 శాతం మంది భారతీయులు విటమిన్ డి లోపంతో ఉన్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ జనరేషన్​లో అతిపెద్ద పోషక లోపాలలో ఒకటిగా విటమిన్​ D లోపం కనిపిస్తోంది. 
  
భారతదేశంలో సూర్యరశ్మి సమృద్ధిగా ఉన్నప్పటికీ దాదాపు 10 మందిలో 9 మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. ఇండోర్​ లివింగ్​స్టైల్​, పొల్యూషన్​, సన్‌స్క్రీన్ వాడకం UVB కిరణాలను అడ్డగింత, డి విటమిన్​ లోపానికి కారణంగా అవుతున్నాయి. ఇది మానసిక స్థితి, ఎముకలు, రోగనిరోధక శక్తిని నిశ్శబ్దంగా ప్రభావితం చేస్తాయి.

సూర్యరశ్మి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుందని మనకు తెలుసు. కానీ మోడర్న్​ లైఫ్​ స్టైల్​ లో  గాజు గోడల ఆఫీసుల్లో,చర్మ సంరక్షణకు SPF నిండిన సన్​ స్క్రీన్ వాడకం మనకు తెలియకుండానే ప్రకృతి సులభంగా పొందగలిగే - విటమిన్ D ని మన నుంచి దూరం చేస్తున్నాయి. 

సూర్యరశ్మికి విరుద్ధంగా.. 

ఇండోర్ జీవనం..పట్టణ ప్రాంతాల్లో నివసించేవారు ఆఫీసులు, క్లాసు రూంలు, జిమ్​ లలో పగటి పూట గడుపుతుంటారు. గాజు కిటికీలు దాదాపు అన్ని UVB కిరణాలను నిరోధిస్తాయి.ఇది మన చర్మానికి విటమిన్ డి తయారు చేయడానికి అవసరమైన కాంతి.

సన్‌స్క్రీన్, దుస్తులు..అందమైన చర్మంకోసం రకరకాల సన్​ స్క్రీన్​ లోషన్లను వాడతారు. ఇవి ఇందులో ఉండే SPF30.. UVB కిరణాలను 95 శాతం వరకు అడ్డుకుంటాయి. శరీరాన్ని నిండుగా కప్పుకోవడం..వాయు కాలుష్యం ఈ సమస్యను మరింత పెంచుతాయి. 

వాయు కాలుష్యం..జర్నల్ ఆఫ్ ఫోటోకెమిస్ట్రీ అండ్ ఫోటోబయాలజీ B లో జరిపిన ఓ అధ్యయనంలో.. భారతీయ మహానగరాలలో అధిక PM 2.5 కంటే ఎక్కువ పరిమాణం ఉన్న కణాలున్న గాలి కాలుష్యంతో చర్మానికి చేరే UVB రేడియేషన్‌ను 60 శాతానికి పైగా తగ్గిస్తుందని తేలింది. 

స్కిన్ టోన్ ఫ్యాక్టర్..ముదురు రంగు చర్మానికి రంగును ఇచ్చే వర్ణద్రవ్యం మెలనిన్.. ఇది సహజంగా UV కిరణాలను ఫిల్టర్ చేస్తుంది. అంటే భారతీయులు తేలికైన చర్మం ఉన్నవారి కంటే అదే మొత్తంలో విటమిన్ డి ఉత్పత్తి చేయడానికి దాదాపు మూడు నుండి ఐదు రెట్లు ఎక్కువ సూర్యరశ్మిని తీసుకోవాలి.

ఈ కారణాలతో మన దేశంలో విటమిన్​ D లోపం ఏర్పడుతుంది. తగు జాగ్రత్తలు తీసుకుంటూ మన ఆరోగ్యానికి అతిముఖ్యమైన విటమిన్​, హార్మోన్​ అయిన విటమిన్​ Dని పొందడం చాలా ముఖ్యం.