
- బుల్లెట్ప్రూఫ్వెహికల్లోనే జర్నీ చేయాలి
బషీర్బాగ్, వెలుగు: గోషామహల్ఎమ్మెల్యే రాజాసింగ్ భద్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలని సిటీ పోలీసులు లెటర్రాశారు. బెదిరింపు కాల్స్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని మరోసారి సూచించారు. ఎక్కడికైనా వెళ్తే బుల్లెట్ ప్రూఫ్ వాహనం, ప్రభుత్వం కేటాయించిన 1+4 సెక్యూరిటీని వినియోగించుకోవాలన్నారు.
రాజాసింగ్ ఉగ్రవాదుల హిట్ లిస్టులో ఉన్న సంగతిని గుర్తుచేశారు. అయితే గోషామహల్ నియోజకవర్గంలో ఇరుకు రోడ్లు ఉన్నాయని , తాను ప్రజలను కలవాలంటే బైక్ పైనే వెళ్లాల్సి వస్తుందని రాజా సింగ్ తెలిపారు.