
హైదరాబాద్‌సిటీ, వెలుగు: సివిల్కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కరించాలని సివిల్కాంట్రాక్టర్ అసోసియేషన్అధ్యక్షుడు దర్శనాల శంకరయ్య కోరారు. సోమవారం సిటీలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. కాంట్రాక్టర్ల సమస్యలను వివరించారు. సానుకూలంగా స్పందించిన మహేశ్కుమార్గౌడ్సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారన్నారు.
చిన్న కాంట్రాక్టర్లకు త్వరగా బిల్లులు వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారన్నారు. మహేశ్‌కుమార్‌గౌడ్‌ను కలిసిన వారిలో అసోసియేషన్చీఫ్ అడ్వైజర్ అజయ్ కుమార్, కాంట్రాక్టర్లు వెంకట్రామిరెడ్డి, రఘు, హనుమంత రెడ్డి, మల్లేశం గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రవీందర్ ఉన్నారు.