
ముషీరాబాద్, వెలుగు: రేషన్ కార్డుదారులకు నాణ్యమైన బియ్యం, గోధుమలు, చక్కెర అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని సివిల్ సప్లై ఎండీ, ప్రిన్సిపల్ సెక్రటరీ డీఎస్ చౌహాన్ తెలిపారు. బుధవారం ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాలో సివిల్ సప్లై 4 6 ఎంఎల్ఎస్ కు సంబంధించిన గోడౌన్స్ ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
కార్యక్రమంలో సివిల్ సప్లై డైరెక్టర్ వీఎస్ఎన్ వీ ప్రసాద్, జాయింట్ సెక్రటరీ ఐఏఎస్ డాక్టర్ ప్రియాంక, చీప్ రేషనింగ్ ఆఫీసర్ జి.ఫణింద్ర రెడ్డి పాల్గొన్నారు.