ఎస్సీలకూ క్రిమీలేయర్ ఉండాలి: సీజేఐ బీఆర్ గవాయ్

ఎస్సీలకూ క్రిమీలేయర్  ఉండాలి: సీజేఐ బీఆర్ గవాయ్

అమరావతి: ఎస్సీలకూ క్రిమీలేయర్ ఉండాలని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ బీఆర్ గవాయ్ తెలిపారు. రిజర్వేషన్ల అంశంలో ఒక ఐఏఎస్ అధికారి పిల్లలను, పేద వ్యవసాయ కూలీ పిల్లలను సమానంగా చూడలేమని చెప్పారు. ఈమేరకు ఆదివారం అమరావతిలో జరిగిన “ఇండియా అండ్ ద లివింగ్ ఇండియన్ కానిస్టిట్యూషన్ ఎట్ 75 ఇయర్స్” కార్యక్రమంలో జస్టిస్ బీఆర్ గవాయ్ మాట్లాడారు. 

‘‘ఇందిరా సాహ్నీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్ తీర్పులో ఇచ్చిన క్రిమిలేయర్ తీర్పును నేను చూశాను. ఓబీసీలకు వర్తించేది ఎస్సీలకూ వర్తించాలని నా అభిప్రాయం. అయినప్పటికీ, ఈ అంశంపై నా తీర్పు విమర్శలను ఎదుర్కొంది” అని పేర్కొన్నారు. చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ 2024లో ఎస్సీలు, ఎస్టీలలో కూడా క్రిమీ లేయర్ ను గుర్తించే విధానాన్ని రాష్ట్రాలు రూపొందించాలని అభిప్రాయపడ్డారు. వారికి రిజర్వేషన్ల ప్రయోజనాన్ని నిరాకరించాలని వెల్లడించారు.