సీజేఐ జస్టిస్​ చంద్రచూడ్​కు హార్వర్డ్​ అవార్డు

సీజేఐ జస్టిస్​ చంద్రచూడ్​కు హార్వర్డ్​ అవార్డు

న్యూఢిల్లీ : సీజేఐ జస్టిస్​ డీవై చంద్రచూడ్​ను ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. అమెరికాలోని హార్వర్డ్​ లా స్కూల్​ సెంటర్​‘అవార్డ్​ ఫర్​ గ్లోబల్​ లీడర్​షిప్’ నకు ఎంపిక చేసింది. జస్టిస్ చంద్రచూడ్.. దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా న్యాయవాద వృత్తికి చేసిన సర్వీస్​కు గాను ఈ అవార్డ్​కు ఎంపికయ్యారు. ఈ నెల 11న ఆన్​లైన్​లో జరిగే కార్యక్రమంలో అవార్డు అందజేస్తారు. ఈ ఈవెంట్​లో హార్వర్డ్​ లా స్కూల్​ సెంటర్ ప్రొఫెసర్​ డేవిడ్ విల్కిన్స్​ పాల్గొని సీజేఐతో మాట్లాడుతారు.

జస్టిస్​ చంద్రచూడ్.. యునైటెడ్ స్టేట్స్‌‌‌‌లోని హార్వర్డ్  లా స్కూల్ నుంచి ఎల్​ఎల్​ఎం డిగ్రీతో పాటు జురిడికల్ సైన్సెస్(ఎస్​జేడీ)లో డాక్టరేట్ పొందారు. అయోధ్య వివాదం కేసుతో సహా పలు కీలక తీర్పులు వెలువరించిన సుప్రీంకోర్టు బెంచ్‌‌‌‌ లలో పనిచేశారు. నవంబర్ 9, 2022న 50వ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేశారు.