వరల్డ్ బెస్ట్ ఫుడ్ దొరికే టాప్ 20లో బెంగళూరు సిటీ.. మిగతా నగరాల్లో మంచి ఫుడ్ దొరకటం లేదా..?

వరల్డ్ బెస్ట్ ఫుడ్ దొరికే టాప్ 20లో బెంగళూరు సిటీ.. మిగతా నగరాల్లో మంచి ఫుడ్ దొరకటం లేదా..?

బెంగళూరు అనగానే మనకు ఐటీ కంపెనీలు, స్టార్టప్‌లు, పెద్ద పెద్ద టెక్ పార్కులే గుర్తొస్తాయి. కానీ, ఇప్పుడు ఈ నగరం బెస్ట్  రుచులతో ప్రపంచాన్ని ఆకట్టుకుంటోంది. కరకరలాడే మసాలా దోశలు, అదిరిపోయే ఫిల్టర్ కాఫీలతో పాటు సరికొత్త ప్రయోగాత్మక వంటకాలకు ఇప్పుడు బెంగళూరు కేరాఫ్ అడ్రస్‌గా మారింది.

తాజాగా 'టైమ్ అవుట్' సంస్థ ప్రకటించిన 'వరల్డ్ బెస్ట్ సిటీస్ ఫర్ ఫుడ్ 2026' లిస్టులో బెంగళూరు 13వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 24 వేల మందికి పైగా స్థానికులను సర్వే చేసి, ఫుడ్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయాలను తీసుకున్న తర్వాత ఈ టాప్-20 లిస్ట్‌ను రెడీ చేశారు.

 లిస్ట్‌లో చోటు దక్కించుకున్న ఏకైక  నగరం!
టైమ్ అవుట్ సర్వే ప్రకారం.. బెంగళూరు సిటీ ఫుడ్ ఎక్స్‌పర్ట్స్ నుంచి 60 శాతం స్కోరును, స్థానికుల నుంచి 82 శాతం క్వాలిటీ రేటింగ్‌ను సాధించింది. ట్రెండీ పిజ్జా బార్‌లు, వైన్ సెంటర్లు, బ్రూవరీలతో అలరిస్తున్న బెంగళూరు.. ఈ అంతర్జాతీయ లిస్టులో నిలిచిన ఏకైక భారతీయ నగరంగా రికార్డు సృష్టించింది.

ప్రపంచంలోనే బెస్ట్ సిటీస్ ఫర్ ఫుడ్ కోసం టాప్ 20 నగరాలు ఇవే:
2026 సంవత్సరానికి గానూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న బెస్ట్ ఫుడ్ నగరాల లిస్టులో  ఏ నగరం ఉందో, వాటి ప్రత్యేకత ఏంటో చూద్దామా:

ర్యాంక్ 1: లిమా(పెరూ)
ఇక్కడి లోకల్ రెస్టారెంట్లయిన 'ఫెర్నాండిని' నుండి అవార్డు గెలుచుకున్న 'సెంట్రల్' రెస్టారెంట్ వరకు.. లిమా నగర ఆహార సంస్కృతి రోజురోజుకూ సరికొత్తగా ఎదుగుతోంది.
 
ర్యాంక్ 2: బ్యాంకాక్ (థాయిలాండ్)
రోడ్డు పక్కన దొరికే స్ట్రీట్ ఫుడ్ నుండి లగ్జరీ ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ల వరకు.. ఇక్కడి యువ చెఫ్‌లు థాయ్ వంటకాలకు సరికొత్త రూపాన్ని ఇస్తున్నారు.

ర్యాంక్ 3: మెక్సికో సిటీ (మెక్సికో)
ఇక్కడి వంటకాల్లో ఆసియా, ఫ్రెంచ్,  మెడిటరేనియన్ రుచుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఇప్పుడు ఒక గ్లోబల్ ఫుడ్ హబ్‌గా మారింది.

ర్యాంక్ 4: లండన్ (బ్రిటన్)
సాధారణ ఇటాలియన్ వంటకాలే కాకుండా, ఎంతో విలాసవంతమైన, రుచికరమైన ఇటాలియన్ రెస్టారెంట్లు ఇక్కడ భారీగా పెరుగుతున్నాయి.

ర్యాంక్ 5: బార్సిలోనా (స్పెయిన్)
ఇక్కడ ఒకవైపు పేరుపొందిన మిష్లిన్-స్టార్ రెస్టారెంట్లు, మరోవైపు సింపుల్‌గా ఉండే హై-ఎండ్ ఆసియా భోజనశాలలు ఉన్నాయి. ఈ రెండింటి కలయిక ఇక్కడి ప్రత్యేకత.

ర్యాంక్ 6: హో చి మిన్ సిటీ (వియత్నాం)
నోరూరించే వీధి ఆహారం (స్ట్రీట్ ఫుడ్), హై-క్లాస్ రెస్టారెంట్ల కలయికతో ఇక్కడి ప్రతి ఫుడ్ ఎక్స్‌పీరియన్స్ చాలా స్పెషల్‌గా ఉంటుంది.

ర్యాంక్ 7: మెల్బోర్న్ (ఆస్ట్రేలియా)
ఈ మధ్య కాలంలో ఇక్కడ అర్మేనియన్, ఈజిప్షియన్, ఫ్రెంచ్, చైనీస్, శ్రీలంకన్, లోకల్ ఆస్ట్రేలియన్ వంటకాలకు ఆదరణ విపరీతంగా పెరిగింది.

ర్యాంక్ 8: బీజింగ్ (చైనా)
ఇక్కడ ఒక కొత్త మార్పు వచ్చింది. ప్రజలు షాపింగ్ మాల్స్‌కు వెళ్లకుండా, ప్రశాంతమైన పార్కుల పక్కన ఉండే కేఫ్‌లలో బ్రంచ్ (ఉదయం/మధ్యాహ్నం భోజనం) చేయడానికి ఇష్టపడుతున్నారు.

ర్యాంక్ 9: ఏథెన్స్ (గ్రీస్)
వందల ఏళ్ల నాటి పాత హోటళ్లు, మోడ్రన్ గాస్ట్రో-పబ్‌లు, లగ్జరీ రెస్టారెంట్లు కలిసి గ్రీస్ రాజధాని వంటకాలకు ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి.

ర్యాంక్ 10: లిస్బన్ (పోర్చుగల్)
టాప్ క్లాస్ మిష్లిన్-స్టార్ హోటళ్ల నుండి తక్కువ ధరలో దొరికే సాదాసీదా భోజనశాలల వరకు.. లిస్బన్ ఫుడ్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది.

ర్యాంక్ 11: కేప్ టౌన్ (దక్షిణాఫ్రికా)
చాలా సింపుల్‌గా, దొరికిన సహజమైన పదార్థాలతోనే ఎంతో రుచికరమైన వంటకాలను తయారు చేయడం ఇక్కడి ఫుడ్ సెంటర్ల స్పెషాలిటీ.

ర్యాంక్ 12: ఒసాకా (జపాన్)
ఒసాకాకు కేవలం 'స్ట్రీట్ ఫుడ్ రాజధాని' అనే పేరు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని దాటి ఎంతో విలాసవంతమైన డైనింగ్ అనుభవాలను అందిస్తోంది.

ర్యాంక్ 13: బెంగళూరు (భారతదేశం)
ఇందిరానగర్, కోరమంగళ, ఎంజీ రోడ్ లోని రెస్టారెంట్లు సాంప్రదాయ, ఆధునిక వంటకాల కలయికకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాయి. తప్పక ట్రై చేయాల్సినవి పిజ్జా 4P's లో లభించే 'గార్లిక్ ష్రింప్ పిజ్జా' లేదా 'బుర్రాటా పిజ్జా'.

ర్యాంక్ 14: నేపుల్స్ (ఇటలీ)
ఇక్కడి పాతకాలపు శాండ్‌విచ్ షాపులు, పిజ్జా సెంటర్లు పాత పద్ధతులను మరువకుండానే సరికొత్త ఆధునిక మార్పులను అలవర్చుకున్నాయి.

ర్యాంక్ 15: న్యూయార్క్ (అమెరికా)
పాతకాలపు ఫుడ్ కోర్టుల నుండి చిన్న చిన్న స్నాక్స్ షాపులు, ఇంటర్నేషనల్ రెస్టారెంట్ల వరకు.. ఇక్కడ అన్ని రకాల రుచులు దొరుకుతాయి.

ర్యాంక్ 16: హాంగ్ కాంగ్
ఇక్కడ ప్రత్యేకమైన కొరియన్ వంటకాలకు క్రేజ్ పెరిగింది. ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన ఫుడ్ గ్రూప్స్‌పై ఫోకస్ పెట్టే రెస్టారెంట్లు ఎక్కువగా వస్తున్నాయి.

ర్యాంక్ 17: బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా)
కేవలం స్టీక్‌హౌస్‌లకే (మాంసపు వంటకాలు) పరిమితం కాకుండా, వాళ్ళ పాత సాంప్రదాయ రుచులను తిరిగి అందిస్తూ ఇక్కడి ఫుడ్ రంగం మరింత విస్తరించింది.

ర్యాంక్ 18: మార్సెయిల్ (ఫ్రాన్స్)
కొత్త తరం చెఫ్‌లు, సరికొత్త రెస్టారెంట్లతో ఈ నగరం దాని ప్రపంచ ప్రసిద్ధ ఆహార సంస్కృతిని మరింత ముందుకు తీసుకెళ్తోంది.

ర్యాంక్ 19: కోపెన్‌హాగన్ (డెన్మార్క్)
ఇక్కడ విభిన్నంగా ఆలోచించి, ప్రయోగాత్మక వంటకాలను అందించే లగ్జరీ మిష్లిన్-స్టార్ రెస్టారెంట్ల సంఖ్య బాగా పెరిగింది.

ర్యాంక్ 20: మెడెలిన్ (కొలంబియా)
ఇప్పటివరకు కేవలం పాత పద్ధతులకే పరిమితమైన ఈ నగరం.. ఇప్పుడు కొత్త రుచులను, వంటకాల రకాలు ఇంతకుముందెన్నడూ లేనంతగా ఆదరిస్తోంది.