సీనియర్​ అడ్వొకేట్​లను అనుమతించను

సీనియర్​ అడ్వొకేట్​లను అనుమతించను

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు సీనియర్​ అడ్వొకేట్​లకు సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణ షాక్​ ఇచ్చారు. అర్జంట్​ లిస్టింగ్​ కేసులను ప్రస్తావించేందుకు వారికి అనుమతి ఇవ్వలేదు. ‘‘సీనియర్​ అడ్వొకేట్​లను అనుమతించే ప్రశ్నే లేదు” అని ఎన్వీ రమణ స్పష్టంచేశారు. సీజేఐ నేతృత్వం లోని బెంచ్​ వద్ద అర్జెంట్​ లిస్టింగ్​ కేసులను ప్రతీరోజూ ప్రస్తావించాలె. తన కేసు అర్జెంట్​ లిస్టింగ్​ చేయాలంటూ.. కోర్టు రూం ముందు నిలబడి ఉన్న ఓ సీనియర్​ అడ్వొకేట్​ సీజేఐను కోరారు.

దీంతో  జస్టిస్​ ఎన్వీ రమణ స్పందిస్తూ..‘‘సీనియర్స్​ను ఎంటర్​టైన్​ చేయను. రేపు మెన్షన్​ చేయాలని దయచేసి మీ అడ్వొకేట్​ ఆన్​  రికార్డు(ఏఓఆర్) ను అడగండి” అని చెప్పారు. క్యూలో కపిల్​ సిబల్​తో పాటు ఏఎం సింఘ్వీ కూడా ఉన్నారు. వీరిని కూడా బెంచ్​ వద్దకు వచ్చేందుకు సీజేఐ అనుమతించలేదు.