లియోనెల్ మెస్సీ.. ఎంతో మంది అభిమానులకు డ్రీమ్ గాడ్. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది ప్రేక్షకులను సొంతం చేసుకున్న ఫుట్ బాల్ సూపర్ స్టార్.. డిసెంబర్ 13 న హైదరాబాద్ ఉప్పల్ లో మ్యాచ్ ఆడనున్నాడు. అందులో సీఎం రేవంత్ రెడ్డితో మ్యాచ్ ఉండటంతో.. ఇప్పటికే ఈ మ్యాచ్ పై ఫుల్ క్రేజ్ వచ్చింది. మ్యాచ్ చూసేందుకు వేలల్లో ఖర్చు చేసి టికెట్స్ కొంటున్నారు.
ఈ మ్యాచ్ కు సంబంధించి ఫిజికల్ గా టికెల్స్ అమ్మటం లేదని ఆర్గనైజర్స్ తెలిపారు. కేవలం ఆన్ లైన్ లోనే టికెట్స్ అందుబాటులో ఉంటయాని చెప్పారు. టికెట్ ధరలు 2 వేల రూపాయల నుంచి 75 వేల వరకు టికెట్స్ రేట్లు ఉన్నట్లు తెలిపారు.
మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి 4 గంటలకు వస్తే మ్యాచ్ చూడొచ్చని తెలిపారు. సాయంత్రం 7 గంటల నుంచి 8 గం వరకు మ్యాచ్ ఉంటుందన్నారు. స్టేడియంలో మెస్సీతో ఫోటో దిగేందుకు రూ.10 లక్షలు అనేది వాస్తవం కాదని.. అలాంటి రూమర్స్ నమ్మరాదని సూచించారు.

