అమ్మాయి విషయంలో అర్థరాత్రి పబ్ లో గొడవ

అమ్మాయి విషయంలో అర్థరాత్రి పబ్ లో గొడవ

హైదరాబాద్ ఫిలింనగర్ లోని మూన్ షైన్ పబ్ లో అర్థరాత్రి  మద్యం మత్తులో వీరంగం సృష్టించారు ఆకతాయిలు.  పబ్‌లో పీకల దాకా మద్యం తాగిన  కొందరు యువకులు  ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించారు. యువతితో డ్యాన్స్ చేసేందుకు ప్రయత్నించారు.  దీంతో ఆ యువతి వెంట వచ్చిన యువకుడు  ఆకతాయిలను నెట్టేశాడు.

దీంతో  ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. తుపాకితో బెదిరించి బీరుబాటిళ్లతో కొట్టి గాయపర్చారంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆకతాయిల దాడిలో ముగ్గురు యువకులు గాయపడటంతో వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి నిందితుల్ని అదుపులోకి తీసుకుని  విచారిస్తున్నారు.