ప్లాంటేషన్ విషయంలో ఘర్షణ..ఫారెస్ట్ సిబ్బందికి గాయాలు

ప్లాంటేషన్ విషయంలో ఘర్షణ..ఫారెస్ట్ సిబ్బందికి గాయాలు

చండ్రుగొండ, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలోని మద్దుకూరు బీట్ అటవీ ప్రాంతంలో శుక్రవారం ప్లాంటేషన్ విషయంలో ఫారెస్ట్ ఆఫీసర్లు, ఆదివాసీల మధ్య ఘర్షణ జరిగింది. చండ్రుగొండ రేంజ్ లోని మద్దుకూరు బీట్ లో 9 ఎకరాల్లో ఫారెస్ట్ ఆఫీసర్లు ఐదు నెలల క్రితం ట్రెంచ్ కొట్టారు. శుక్రవారం రెండు హెక్టార్లలో ప్లాంటేషన్ చేసేందుకు రేంజర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సెక్షన్, బీట్ ఆఫీసర్లు వెళ్లారు. అటవీ ప్రాతంలో నివసిస్తున్న మంగలి గుంపు ఆదివాసీ గొత్తికోయలు 60 మంది వారిని అడ్డుకున్నారు.

ఏఎస్సై కోటేశ్వరరావు, రేంజర్ శ్రీనివాసరావు ఆదివాసీలకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వినిపించుకోలేదు. ప్లాంటేషన్ పనులు అడ్డుకోవడంతో తోపులాట, ఘర్షణ జరిగింది. సెక్షన్ ఆఫీసర్లు నాగరాజు, రామారావు, బీట్ ఆఫీసర్లు భాస్కర్, రేవ్ సింగ్, శ్రావణ్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి.  వెంటనే గాయపడ్డవారిని చండ్రుగొండ పీహెచ్​సీకి తరలించారు. తమపైనే ఫారెస్ట్ ఆఫీసర్లు దాడి చేశారని ఆదివాసీలు ఆరోపించారు. రేంజర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ అదనపు సిబ్బందితో ప్లాంటేషన్ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. దాడిపై పోలీసులకు, ఫారెస్ట్ జిల్లా ఆఫీసర్ల కు కంప్లైంట్ చేశామన్నారు.