
తిరుమల, వెలుగు: సూర్యగ్రహణం కారణంగా ఈ నెల 26న తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు మూసివేయనున్నారు. ఉదయం 8.08 గంటల నుండి 11.16 వరకు సూర్యగ్రహణం ఉంటుంది. ఆలయ సంప్రదాయం ప్రకారం ఆరు గంటల ముందుగా అంటే 25వ తేదీ బుధవారం రాత్రి 11 గంటలకు తలుపులు మూస్తారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు తెరిచి ఆలయశుద్ధి, ఇతర వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 2 గంటల తర్వాత భక్తులకు దర్శనం ప్రారంభిస్తారు. 26న తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.