జూరాల ప్రాజెక్టు  గేట్లన్నీ మూసివేత

జూరాల ప్రాజెక్టు  గేట్లన్నీ మూసివేత

కృష్ణా నదిలో వరద ప్రవాహం తగ్గడమే కారణం

విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువకు కొనసాగుతున్న నీటి విడుదల

మహబూబ్ నగర్: కృష్ణా నదిలో వరద ప్రవాహం కాస్త తగ్గుముఖం పట్టడంతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద గేట్లన్నీ మూసివేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండిపోవడంతోపాటు.. దిగువన ఉన్న కాలువలకు సాగునీరు అవసరం కావడంతో విద్యుత్ ఉత్పత్తి ద్వారా నీటి విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహానికి అనుగుణంగా.. ఎగువ నుండి వస్తున్న వరదకు అనుగుణంగా గేట్లు ఎత్తుతూ.. దించుతూ నీటి విడుదల కొనసాగిస్తున్నారు.

ఆల్మట్టి నుండి వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పడుతుండడంతో వస్తున్న నీటిని వస్తున్నట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. నిన్నటి వరకు లక్ష క్యూసెక్కులకు పైగా ఉన్న వరద.. ఉదయం 6 గంటల సమయానికి ఇన్ ఫ్లో 48 వేల క్యూసెక్కులకు పడిపోయింది. ప్రస్తుతం ఇన్ ఫ్లో: 48 వేల క్యూసెక్కులు ఉండగా.. గేట్లన్నీ మూసివేసిన అధికారులు విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువన ఉన్న కాలువలకు.. శ్రీశైలానికి 37 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీట్టి సామర్థ్యం  9.657 టీఎంసీలు కాగా..  ప్రస్తుత నీటి నిల్వ 8.929  టీఎంసీలకు చేరుకుంది. గరిష్ట స్థాయికి చేరుకోవడంతో గత రెండు వారాలుగా కాలువలకు విడుదల చేస్తున్నారు. మళ్లీ వరద పెరిగే గేట్లు కూడా తెరచి నీళ్లు విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు.