ఒమిక్రాన్‌‌‌‌ను క్లాత్ మాస్కులు ఆపలేవ్!

ఒమిక్రాన్‌‌‌‌ను క్లాత్ మాస్కులు ఆపలేవ్!
  • ఒమిక్రాన్ కు క్లాత్ మాస్కులు పనికిరావు
  • ఆక్స్‌‌‌‌ఫర్డ్ వర్సిటీ ప్రొఫెసర్ హెచ్చరిక 

వాషింగ్టన్: స్పీడ్‌‌‌‌గా వ్యాపిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌‌‌‌ను క్లాత్‌‌‌‌ మాస్కులతో కంట్రోల్‌‌‌‌ చేయలేమని ఆక్స్‌‌‌‌ఫర్డ్ వర్సిటీ ప్రైమరీ హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రొఫెసర్ త్రిష్‌‌‌‌ గ్రీన్‌‌‌‌హాల్గ్‌‌‌‌ హెచ్చరించారు. మిక్స్‌‌‌‌డ్ మెటీరియల్‌‌‌‌తో తయారైన 2 లేదా3 లేయర్ల మాస్కులు మాత్రమే ఎఫెక్టివ్‌‌‌‌గా పనిచేస్తాయని త్రిష్ అన్నారు. ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున రీయూజబుల్‌‌‌‌ క్లాత్‌‌‌‌ మాస్కులను వాడెటోళ్లు ఆలోచించాలని హెచ్చరించారు. కాగా, గత సమ్మర్‌‌‌‌‌‌‌‌లో సడలించిన రెస్ట్రిక్షన్స్‌‌‌‌ను బ్రిటన్‌‌‌‌ ప్రభుత్వం మరోసారి అమలులోకి తెచ్చింది. పబ్లిక్ ట్రాన్స్‌‌‌‌పోర్ట్, షాపులు, ఇండోర్ వెన్యూలలో తప్పనిసరిగా మాస్క్‌‌‌‌ పెట్టుకోవాలని ఆదేశించింది.