ఉక్రెయిన్‌ వేర్పాటువాద ప్రాంతాలకు రష్యా స్వతంత్ర హోదా

ఉక్రెయిన్‌ వేర్పాటువాద ప్రాంతాలకు రష్యా స్వతంత్ర హోదా

రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య నెలకొన్న హై టెన్షన్‌..పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇరు దేశాల బార్డర్ లో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఏ క్షణంలోనైనా ఉక్రెయిన్ పై దాడి చేసేందుకు రష్యా సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించింది. అంతేకాదు వార్ అనివార్యం అనే సంకేతాలను పంపిస్తుంది. యుద్ధం వద్దు..చర్చలతో సమస్యను పరిష్కరించుకుందామని ఎవరెన్ని చెప్పినా పుతిన్ వినడం లేదు.ఓవైపు అమెరికాతో చర్చలంటూనే, ఉక్రెయిన్‌లోని తిరుగుబాటుదారులతో దాడులు చేయిస్తోంది.జాతిని ఉద్దేశించి ప్రసంగించిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఉక్రెయిన్‌ దగ్గర అణుబాంబు ఉందని ఆరోపించారు. కొన్నిదేశాల ఆర్మీ సహకారంతో రష్యాపై దాడికి ఉక్రెయిన్ ప్రయత్నిస్తోందన్నారు. చొరబాటుకు ప్రయత్నించిన ఐదుగురు ఉక్రెయిన్ సైనికులను రష్యా దళాలు కాల్చి చంపినట్లు తెలిపింది రష్యా. తూర్పు ఉక్రెయిన్‌లోని డొనెట్స్క్‌, లుహాన్స్క్‌లను స్వతంత్ర రాష్ట్రాలుగా గుర్తిస్తూ సంతకాలు చేశారు పుతిన్. 

డొనెట్స్క్‌, లుహాన్స్క్‌ ప్రాంతాలపై అమెరికా ఆంక్షలు

ఉక్రెయిన్‌లోని వేర్పాటువాద ప్రాంతాలైన డొనెట్స్క్‌, లుహాన్స్క్‌ను రష్యా స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తించడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ రెండు ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు. అక్కడ పెట్టుబడులు, వాణిజ్యంపై నిషేధం విధిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు బైడెన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉత్తర్వులపై సంతకం చేశారు.

మరిన్ని వార్తల కోసం

ఉక్రెయిన్​పై దాడికి.. రష్యా ఫైనల్ ప్రిపరేషన్!

చంద్రుడిపై కూలనున్న రాకెట్