కాళేశ్వరం ఏమైనా నిషేధిత ప్రాంతమా..?

కాళేశ్వరం ఏమైనా నిషేధిత ప్రాంతమా..?

సీఎల్పీ బృందం కాళేశ్వరం వెళ్లకుండా అడ్డుకోవడానికి కారణమేంటో ప్రభుత్వం చెప్పాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే అక్కడ కాళేశ్వరం ఉందా మాయమైందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. కాళేశ్వరం నీళ్లను ఎత్తిపోయడానికి విదేశాల నుంచి తీసుకొచ్చిన బాహుబలి పంపు మోటర్లు తిరిగి పనిచేస్తాయా లేదా అనే విషయం ప్రజలకు చెప్పాలన్నారు.

‘‘కాళేశ్వరంలో బాహుబలి మోటార్లు ఎందుకు మునిగాయి. నష్టం ఎంత.. లోపాలు ఏంటీ ?. విపక్షాలు కాళేశ్వరం సందర్శనకు వెళ్తే ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటోంది. కాళేశ్వరం ఏమైనా నిషేధిత ప్రాంతమా. రహస్య ప్రాంతంగా ప్రకటించారా’’ అని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. కాళేశ్వరంలో 144 సెక్షన్ విధించడానికి కారణం ఏంటన్నది తెలపాలన్నారు. ప్రభుత్వ నిర్భంధాలను అధిగమించి  కాళేశ్వరాన్ని సందర్శించడంతోపాటు అక్కడి రహస్యాలను బట్టబయలు చేస్తామని భట్టి స్పష్టం చేశారు.