సీఎం కేసీఆర్కు భట్టి విక్రమార్క బహిరంగ లేఖ

సీఎం కేసీఆర్కు భట్టి విక్రమార్క బహిరంగ లేఖ

సీఎం కేసీఆర్ కు సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క బహిరంగ లేఖ రాశారు. పోడు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని లేఖలో కోరారు. కొన్నేళ్లుగా అదివాసులు, గిరిజనులు పోడు భూముల సమస్యతో అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.  పోడు భూములకు సంబంధించిన అనేక సమస్యలను భట్టి తన లేఖలో ప్రస్తావించారు.

అదివాసులు, గిరిజనులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ప్రకటనలు నీటి మీద రాతలు లాగా మిగిలిపోయాయని అన్నారు భట్టి. పోడు భూములపై పరిష్కారం చూపకపోతే తాము పోరాటాలు చేస్తామని చెప్పారు. అదివాసులు, గిరిజనులు రోడ్ల మీదికి రాకముందే సమస్యను పరిష్కారించాలని కోరారు. 

https://www.youtube.com/watch?v=S0e1Qok1Hfg