లేటెస్ట్ టెక్నాలజీతో మర్డర్ కేసులను క్లూస్ టీం ఛేదిస్తోంది

లేటెస్ట్ టెక్నాలజీతో మర్డర్ కేసులను క్లూస్ టీం ఛేదిస్తోంది

హైదరాబాద్ సిటీ పోలీస్ లో స్పెషల్ వింగ్ క్లూస్ టీమ్ కు దేశంలోనే మంచి పేరు ఉందన్నారు పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్. హైదరాబాద్ లో 17 డివిజన్లలో 24 గంటలు క్లూస్ టీమ్ వాచ్ చేస్తోందన్నారు. టెక్నాలజీని ఉపయోగించి కేసులు ఛేదించడం అనేది చాలా ముఖ్యమన్న సీపీ…ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నేరస్తులు కూడా చాలా టెక్నాలజీని ఉపయోగిస్తున్నారన్నారు. కోట్లాది రూపాయలు విలువ చేసే పరికరాలను క్లూస్ టీమ్ కు అందజేశామని చెప్పారు. గతేడాది సంచలనం సృష్టించిన దిశ కేసు, ఈ ఏడాది వరంగల్ 10 మంది మర్డర్ కేసులో క్లూస్ టీమ్ చాలా ఆధారాలు సేకరించిందని తెలిపారు. ఫిబ్రవరిలో కరీంనగర్ లో జరిగిన మర్డర్ కేసులో క్లూస్ టీమ్ కేసును ఛేదించిందని…అదే విధంగా హైదరాబాద్ బంజారాహిల్స్ లోని మర్డర్ కేసు టెక్నీకల్ ఏవిడెన్స్ ను క్లూస్ టీమ్ సేకరించిందన్నారు. అంతేకాదు ఎక్కడ ఎలాంటి క్రైం జరిగినా క్లూస్ టీమ్ చాలా యాక్టివ్ గా పని చేస్తోందని తెలిపారు.

ప్రజలు క్లూస్ టీంకు సహకరించాలని..సీన్ ఆఫ్ క్రైమ్ లో ఆధారాలు చేరిపి వేయకుండా కాపాడాలని సూచించారు సీపీ.