ఆటో నడిపిన సీఎం చంద్రబాబు

ఆటో నడిపిన సీఎం చంద్రబాబు

 ఏపీ సీఎం చంద్రబాబు ఆటో డ్రైవర్ అయ్యారు. విజయవాడలోని క్యాంప్ ఆఫీస్ దగ్గర ఆటోడ్రైవర్ల యూనియన్ నాయకులు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో చంద్రబాబు సరదాగా ఆటో నడిపి.. డ్రైవర్ బాబుగా మారారు. ఖాకీ అంగి వేసుకుని.. టాప్ లేని ఆటోను నడిపారు. ఆటోలో సెక్యూరిటీ అధికారులు కూర్చుని ఉన్నారు. బాబు ఆటో నడుపుతుంటే… భధ్రతా సిబ్బంది వాహనంతో పాటు ముందుకు కదిలారు.

ఆటో సహా 3, 4, 6 చక్రాల వాహనాలన్నింటికీ మోటార్ వాహన చట్టం లైఫ్ టాక్స్ ను రద్దు చేసినందుకు… యూనియన్ నాయకులు సీఎం చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆటోడ్రైవర్లందరికీ పెద్దన్నగా ఉంటానన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. డ్రైవర్ల సంక్షేమం తాను చూసుకుంటానని… టీడీపీ జెండాను రాష్ట్రమంతటా రెపరెలాడించే బాధ్యతను ఆటోడ్రైవర్లు తీసుకోవాలన్నారు. ట్యాక్స్ తో పాటు.. ఇంధన ఛార్జీలు, ఇన్సూరెన్స్ భారం కూడా తగ్గించేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు చంద్రబాబు.