ఏపీలో సాయికృష్ణ మిస్సింగ్ కేసు రాజకీయ దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న కూటమి ప్రభుత్వం సీఐ నాగరాజును సస్పెండ్ చేసి అరెస్ట్ చేసింది. సీఐ నాగరాజు అరెస్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అతని అనుచరులు. నాగరాజుకు మద్దతుగా ర్యాలీ కూడా చేపట్టారు అతని అనుచరులు. ఈ క్రమంలో నాగరాజుకు మద్దతుగా ర్యాలీలు చేయడంపై సీరియస్ అయ్యారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ చేయడంపై ఆరా తీశారు చంద్రబాబు.
నాగరాజు అరెస్ట్ సమయంలో పోలీసులను అడ్డుకున్న మద్దతుదారులు.. గత నాలుగు రోజులుగా ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో మద్దతుదారుల ఆందోళన వివరాలు ఇవ్వాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మద్దతుదారుల వివరాలు సేకరిస్తున్నారు ఇంటెలిజెన్స్ అధికారులు.
నాగరాజును అరెస్ట్ చేసిన సిట్ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. మంగళవారం రాత్రి కమాండ్ కంట్రోల్ రూమ్‌లో నాగరాజును ఉంచారు సిట్ అధికారులు. సాయికృష్ణ అదృశ్యంపై సీఐ నాగరాజును సిట్ అధికారులు ప్రశ్నించారు. సాయికృష్ణను మార్కాపురం నుంచి విజయవాడకు తీసుకువచ్చారనే ఆరోపణలపై ఆరా తీశారు అధికారులు.
►ALSO READ | సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్..
సాయికృష్ణను మార్కాపురం నుంచి విజయవాడ తీసుకువచ్చారా...? ఒకవేళ తీసుకువస్తే ఎందుకు తీసుకువచ్చారు/..? ఎవరు తీసుకురమ్మన్నారు..? అని ప్రశ్నించారు అధికారులు. కృష్ణలంక పీఎస్‌లోని మిగతా సిబ్బంది పాత్ర, సీసీ కెమెరాల ఫుటేజ్‌పై కూడా వివరాలు సేకరించారు అధికారులు. ఇవాళ సీఐ నాగరాజును కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గర పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు.
