గ్రామీణ క్రీడా రంగాన్ని బలోపేతం చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతున్న సీఎం కప్ 2024 ని విస్తృత స్థాయిలో ప్రచారం చేసేందుకు టార్చ్ రిలే ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఆదివారం (అక్టోబర్ 20) నాటికి 32 జిల్లాలను పూర్తి చేసుకుంది. అక్టోబర్ మూడో తేదీ హైదరాబాద్ నగరం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ర్యాలీ 31 జిల్లాలు పూర్తిచేసుకుని రంగారెడ్డి జిల్లా కేంద్రానికి చేరుకుంది. పల్లెల నుంచి ప్రపంచ స్థాయి క్రీడాకారులు కోసం సి.ఎం. కప్ ప్రారంభించడం జరుగుతుంది.
Also Read :- CM రేవంత్‌కు బండి సంజయ్ బహిరంగ లేఖ
రంగారెడ్డి జిల్లా టి కే ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కమాన్ దగ్గర వేలాదిమంది క్రీడాకారుల ఉత్సాహ భరితమైన వాతావరణాల్లో క్రీడాజ్యోతి ప్రారంభమై సరూర్నగర్ ఇండోర్ స్టేడియంకి చేరుకుంది. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన సభా కార్యక్రమంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కి గౌడ్, డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, ఎల్బీనగర్ ఏసిపి కృష్ణయ్య, చంద్ర రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ పాల్గొన్నారు.