
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో మరాఠీ ఎడ్యుకేషన్ ను తప్పనిసరి చేస్తూ శాసన మండలిలో ఆయన ఓ ప్రకటన చేశారు. మహారాష్ట్రలో అందరూ మరాఠీ చదవాల్సిందే అని ఆయన అన్నారు. రెగ్యులర్ సిలబస్ , సబ్జెక్టులను చదువుతూనే… మరాఠీ లాంగ్వేజ్ ను తప్పనిసరి చేస్తున్నామని చెప్పారు. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తుందని చెప్పారు.
మహారాష్ట్రలో మరాఠీని లాంగ్వేజ్ సబ్జెక్టుగా అందరూ చదవాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. మరాఠీని వాలంటరీగా నేర్చుకోవాలని కొన్నాళ్లుగా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చెబుతూ వస్తున్నారు. ఇవాళ శాసన మండలిలో ఆయన విధానపరమైన ప్రకటన చేశారు.