సెప్టెంబర్1 నుంచి ఎయిర్ ఇండియా విమానాలు రద్దు.. ఎందుకంటే

సెప్టెంబర్1 నుంచి ఎయిర్ ఇండియా విమానాలు రద్దు.. ఎందుకంటే

ఎయిర్ ఇండియా విమాన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది..సెప్టెంబర్ 1 నుంచి డిల్లీ నుంచి వాషింగ్టన్ వెళ్లే  అన్ని విమానాలను రద్దు చేసింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 1 తర్వాత బుక్ అయిన అందరు ప్రయాణికులను ఎయిర్ ఇండియా కాంటాక్ట్ చేస్తుంది. అయితే ఎయిర్ ఇండియా టొరంటో, వాంకోవర్ సహా మరో ఆరు ఉత్తర అమెరికా నగరాలకు నాన్-స్టాప్ ఫ్లైట్స్ కొనసాగిస్తున్నట్లు సంస్థ తెలిపింది. 

బోయింగ్ 787-8 విమానాల రెట్రోఫిట్ ప్రోగ్రాం..ప్రయాణికుల్లో సర్వీస్ లెవల్ మెరుగుపరిచే దిశగా ఎయిర్ ఇండియా తన 26 బోయింగ్ 787-8 విమానాలను సీటింగ్, ఇంటీరియర్ వంటి అడ్వాన్స్‌డ్ కేబిన్ రెట్రోఫిట్ చేస్తోంది. దీంతో చాలా విమానాలను రద్దు చేశారు. ఈ ప్రోగ్రామ్ 2025 జూలైలో ప్రారంభమై 2026 చివరి వరకు కొనసాగుతుంది.

పాకిస్తాన్ గగనతలం మూసివేత కూడా విమానాల రద్దుకు ఓ కారణంగా చెప్పొచ్చు. భారత్, పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల మధ్య పాకిస్తాన్ ఎయిర్ బేస్ మూసివేయడం జరిగింది. దీంతో ఇంధనం ఖర్చు, ఆపరేషన్ టైంపెరిగింది. 

ఢిల్లీ- వాషింగ్టన్ మార్గంలో సెప్టెంబర్ 1 తర్వాత బుక్ అయిన అందరు ప్రయాణికులను ఎయిర్ ఇండియా కాంటాక్ట్ చేస్తుంది. ప్రయణికులకు రెండు ప్రత్యామ్నాయ మార్గాలను చూపింది. యూఎస్ ఎయిర్ లైన్స్, ద్వారా న్యూయార్క్ , JFK న్యూయార్క్, EWR చికాగో, శాన్ ఫ్రాన్సిస్కో ద్వారా వన్ స్టాప్ కనెక్షన్లతో వెళ్లేందుకు అవకాశం కల్పించారు. లేదా పూర్తి డబ్బును వాపస్ ఇచ్చేందుకు ఎయిర్ ఇండియా సిద్దమైంది. చెక్-దు బ్యాగేజీ, సింగిల్-ఇటినరీ యథాతధంగా కొనసాగుతుంది.

ఎయిర్ ఇండియా టొరంటో, వాంకోవర్ సహా మరో ఆరు ఉత్తర అమెరికా నగరాలకు నాన్-స్టాప్ ఫ్లైట్స్ కొనసాగుతుంది. అంతర్జాతీయ ఆపరేషన్ అక్టోబర్ 1, 2025 నాటికి పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని CEO చెప్పారు. DGCA, IATA ఆడిటింగ్, భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా అమలులో ఉన్నాయి.