గుడివాడ అమర్నాథ్ను అభినందించిన సీఎం జగన్ 

 గుడివాడ అమర్నాథ్ను అభినందించిన సీఎం జగన్ 

మంత్రి గుడివాడ అమర్నాథ్ను సీఎం జగన్  ప్రత్యేకంగా అభినందించారు.  ఇటీవల  విశాఖలో  జరిగిన గ్లోబల్ సమ్మిట్ ను  విజయవంతంగా నిర్వహించారని కేబినేట్ భేటీలో అమర్నాథ్ను సీఎం జగన్ మెచ్చుకున్నారు. అటు  45 అజెండా అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించగా,  అసెంబ్లీలో ప్రవేశపెట్టే 15 బిల్లులకు ఆమోదం తెలిపింది కేబినెట్‌. కొత్త ఇండస్ట్రియల్‌ పాలసీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 2023-27 పారిశ్రామిక విధానానికి కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. 

మంత్రలకు వార్నింగ్ 

జులై నుంచి విశాఖ నుంచే పరిపాలన కొనసాగిస్తానని  సీఎం జగన్ మంత్రులతో అన్నారు.  మంత్రుల పనితీరును తాను గమనిస్తున్నానని, ఏ మాత్రం తేడా వచ్చిన ఉద్వాసన తప్పదని మంత్రులను  హెచ్చరించారు. సక్రమంగా పనిచేయని మంత్రులకు వేటు తప్పదని  కేబినెట్‌ మీటింగ్ లో జగన్ వార్నింగ్ ఇచ్చారు. త్వరలో జరగనున్న  ఏడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు గెలవాల్సిందేనని  మంత్రలకు జగన్ స్పష్టం చేశారు.  ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను అసెంబ్లీలో ప్రజలకు వివరించాలని జగన్ మంత్రలకు సూచించారు.