సీఎం జగన్ ఫస్ట్ ఎన్నికల హామీ : పెన్షన్ పెంచుతున్నట్లు హింట్

సీఎం జగన్ ఫస్ట్ ఎన్నికల హామీ : పెన్షన్ పెంచుతున్నట్లు హింట్

ఆంధ్రప్రదేశ్​లో ఎన్నికల రణరంగం మొదలైంది.  వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం జగన్​ ఏలూరు జిల్లా దెందులూరులో ఎన్నికల శంఖారావాన్ని ప్రారంభించారు.2024 ఎన్నికలు ఎంపీ, ఎమ్మెల్యేలను ఎన్నుకొనేవి కాదంటూ..... 3 వేల రూపాయిల పెన్షన్​ మీ ఇంటికి రావాలన్నా.. భవిష్యత్తులో పెరగాలన్నా... ప్రజల సంక్షేమం... అభివృద్దిని నిర్ణయించే ఎన్నికలు అని సిద్దం సభలో సీఎం జగన్​ అన్నారు.  14 ఏళ్లలో చంద్రబాబు ఏం చేశాడని దెందులూరు సభలో సీఎం జగన్​ ప్రశ్నించారు. అబద్దాల పునాదులమీద ప్రతిపక్షాలు ప్రచారం మొదలు పెట్టాయి. చంద్రబాబు, దత్తపుత్రుడు, ఇతర తోడేళ్లు కలిసి జగన్​పై పోటీకి దిగుతున్నారని జగన్​ అన్నారు.

ఇంకా ఏమన్నారంటే 

  • మరో చారిత్ర విజయానికి సిద్దమా అని సభలో ప్రజలను ప్రశ్నించారు
  • జగన్​ ఒంటరి వాడు కాదు.. నాకు దేవుడు, ప్రజలు తోడున్నారు. 
  • దుష్ట చతుష్టయంపై విజయానికి సిద్దమా...
  • చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలను చీల్చి చెండాడాలి
  • ఎన్నికల రణక్షేత్రంలో మీరు కృష్ణుణి పాత్ర పోషిస్తే.. నేను అర్జునిడి పాత్ర పోషించి ... కౌరవులపై పోరాడతా
  • రామాయణం, భారతంలో ఉన్న విలన్లు చంద్రబాబు అండ్​ కో
  • పొత్తులు వారి సైన్యమైతే.. దేవుడు,  ప్రజాబలమే నాది
  • చంద్రబాబు హయాంలో పేదల ఖాతాల్లో డబ్బులు వచ్చాయా
  • నా కుటుంబ సైన్యం ఇక్కడే ఉంది
  • ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన హామీలను 99 శాతం అమలు చేశా
  • సంక్షేమం, అభివృద్దిపై టీడీపీ దండయాత్ర చేస్తుంది
  •  గ్రామంలో అభివృద్దిపై పెత్తందారులు  దండయాత్ర చేస్తారు
  • ఎన్నికల మ్యానిఫెస్టో పవిత్ర గ్రంధం
  • సచివాలయ వ్యవస్థను  మీ జగన్​.. వైఎస్సార్​ సీపీ తీసుకొచ్చింది
  • ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 500 రకాల సేవలు అందిస్తున్నాం
  • వివక్ష లేని సచివాలయ పాలన తెచ్చా
  • కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు అభివృద్ది చేశా
  • గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీల్లో 10 శాతమైనా అభివృద్ది చేశాడా
  • నాడు నేడు పథకంలో పాఠశాలలను ఆధునీకరించాం
  • విద్యార్థుల చేతుల్లో ట్యాబులు కనిపిస్తున్నాయి
  • నామినేటెడ్​ పోస్టుల్లో 50 శాతానికి పైగా బీసీలకు ఇచ్చాం
  • సంక్షేమం కోసం 2 లక్షల 55 వేల కోట్లు ఖర్చు పెట్టాం
  • బటన్​ నొక్కి నేరుగా లబ్దిదారుల ఖాతాలో జమ అవుతున్నాయి
  • వైసీపీ పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చా
  • 66 లక్షల కుటుంబాలకు సంక్షేమం అదిస్తున్నాం
  • ప్రేమ, అభిమానం, కమిటిమెంట్​ చూపా
  • సామాజిక న్యాయానికి పెద్ద పీట వేశా