బడ్జెట్ ను ప్రతిపక్షాలు విమర్శించడం కామనే

బడ్జెట్ ను ప్రతిపక్షాలు విమర్శించడం కామనే

చట్ట సభల్లో ప్రతి విషయంపై చర్చ జరగాల్సిన అవసరముందన్నారు సీఎం కేసీఆర్.అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా వివరణ ఇచ్చిన కేసీఆర్..  బడ్జెట్ పై ప్రతిపక్షాలు విమర్శించడం సహజమేనన్నారు. బడ్జెట్ అంటే అంకెలు మాత్రమే కాదన్నారు. బడ్జెట్ అంటే బ్రహ్మపదార్థం అన్నట్లు భావిస్తున్నారన్నారు. బడ్జెట్ అంటే అధికారపక్షం ఆహా అంటది..ప్రతిపక్షం పసలేదంటదన్నారు.బడ్జెట్ అంటే నిధుల కూర్పు అని అన్నారు.  ప్రభుత్వానికి రెండు అధికారాలు ఉంటాయన్నారు. ఒకటి ట్యాక్స్ విధించే అధికారం..రెండవది అరెస్ట్ చేసే అధికారం అని అన్నారు. అప్పులను అప్పుగా చూడొద్దని.. వనరుల సమీకరణగా చూడాలన్నారు.

అప్పుల్లో మన రాష్ట్రం దేశంలో 25వ స్థానంలో ఉందన్నారు. ఆర్థిక క్రమశిక్షణను కఠినంగా పాటిస్తున్నామన్నారు. మనకంటే ఎక్కువ అప్పులు చేస్తున్న రాష్ట్రాలు చాలానే ఉన్నాయన్నారు. మన అప్పుల శాతం 23 శాతమేనన్నారు. అప్పులపై భట్టికి ఆందోళన అవసరం లేదన్నారు.ప్రస్తుతం భారత దేశ అప్పు152  లక్షల కోట్లు అని అన్నారు. అవినీతిని పూర్తిగా నిర్మూలించామన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కుతోందన్నారు. పూర్తి పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రాల ఉనికి లేకుండా చేస్తాం..రాష్ట్రాలను అణిచివేస్తామనే దుర్మార్గ వైఖరితో కేంద్రం ఉందన్నారు. కేంద్రం ఇష్టమున్నట్లు నిధుల సమీకరణ చేసుకుంటుందన్నారు. రాష్ట్రాలకు ఇచ్చే నీతినే కేంద్రం పాటించాలన్నారు. కేంద్రం ఫర్ఫామెన్స్ సరిగ్గా లేదని..మనకంటే బ్యాడ్ గా ఉందన్నారు. నిధుల సమీకరణపై కేంద్రం ఆంక్షలు పెడుతుందన్నారు. కేంద్రం తీరు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమన్నారు.