కమాండ్ కంట్రోల్ సెంటర్ భవిష్యత్ లో అద్భుతంగా పనిచేస్తోంది

కమాండ్ కంట్రోల్ సెంటర్ భవిష్యత్ లో అద్భుతంగా పనిచేస్తోంది

గత ఎనిమిదేళ్లుగా రాష్ట్రం అశాంతికి లోనుకాకుండా శాంతిభద్రతల నిలయంగా ముందుకు సాగుతోందని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ లో చాలా నేరాలు తగ్గాయని చెప్పారు. కమాండ్ కంట్రోల్ రూం సెంటర్ ను ప్రారంభించిన కేసీఆర్.. కమాండ్ కంట్రోల్ సపోర్ట్తో పోలీసులు మంచి ఫలితాలు సాధిస్తారని  ఆశిస్తున్నట్లు తెలిపారు. పోలీసులు ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాల్సిన అవసరం వుందని చెప్పారు

రాష్ట్రంలో సంస్కారవంతమైన పోలీసింగ్

ఫ్రెండ్లీ పోలీసింగ్ తో  పాటు రాష్ట్రంలో సంస్కారవంతమైన పోలీసింగ్ రావాలని కేసీఆర్ ఆకాంక్షించారు. పోలీసులకు ఎటువంటి సహకారం కావాలన్న అందిస్తానని వెల్లడించారు. నేరగాళ్లు రూపాలు మారుస్తున్నారన్న సీఎం.. ప్రపంచాన్ని గందరగోళ పరుస్తోన్న అంశం సైబర్ క్రైం అని చెప్పారు. సైబర్ క్రైం ఒక క్రిటికల్ అంశమని..డీజీ లేదా అడీషనల్ డీజీని పెట్టి వాటిపై ఫోకస్ పెట్టాలని సూచించారు. విదేశాల్లో సైబర్ క్రైమ్ పై ఎటువంటి విధానం ఉందో తెలుసుకోవాలని సూచించారు.

డ్రగ్స్ కట్టడికి గట్టి చర్యలు తీసుకోండి

భవిష్యత్ తరాల బంగారు భవితను నాశనం చేసే డ్రగ్స్ కట్టడికి పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. డ్రగ్ ఫ్రీ స్టేట్ గా  తెలంగాణను  తీర్చిదిద్దాలని చెప్పారు. అమెరికాలోని న్యూయార్క్ సిటీలో డ్రగ్స్ వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని..అయితే అక్కడి అధికారుల చర్యల వల్ల అది అంతమైందని చెప్పారు. రాష్ట్రంలో కూడా అటువంటి చర్యలు తీసుకుని డ్రగ్స్ ను అరికట్టాలని కేసీఆర్ సూచించారు.