తెలంగాణలో దసరా రోజు పాలపిట్టను దర్శించుకోవడం ఆనవాయితి. పండుగ పూట పాలపిట్టను చూస్తే సకల శుభాలు కలుగుతాయని జనం నమ్మకం. అంతరించే దశలో ఉన్న ఈ పక్షులు కనిపించడం అత్యంత అరుదు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులకు మాత్రం పాలపిట్ట దర్శనభాగ్యం దక్కింది.
దసరా రోజు ప్రగతి భవన్ లోని నల్లపోచమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన కేసీఆర్ ఆ తర్వాత ఆయుధ పూజ నిర్వహించారు. అనంతరం ఆయన ప్రగతి భవన్లో పాలపిట్టను దర్శించుకున్నారు. పంజరంలో ఉన్న పాలపిట్టకు సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు మొక్కుతున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
