- మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య
మెహిదీపట్నం, వెలుగు: పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసి చివరి శ్వాస వరకు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మాజీ కేంద్రమంత్రి వెంకటస్వామి (కాకా), పీవీ రావు పనిచేశారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య కొనియాడారు. సోమవారం ఏసీ గార్డ్స్‌లో జరిగిన కాకా 11వ వర్ధంతి, పీవీ రావు 20వ వర్ధంతి సభలో ఆయన పాల్గొన్నారు. వారి ఫొటోలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
