
మొదటి సారిగా గవర్నర్ తో సీఎం కేసీఆర్,ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు గురించి వీరు ఈ భేటీలో చర్చకు వచ్చినట్లు సమాచారం. స్నేహపూర్వక వాతావరణంలో రెండు రాష్ట్రాల అభివృద్ధి, నీటి వివాదాలపై గవర్నర్ వద్ద చర్చించుకున్నారని తెలిసింది. విభజన చట్టంలోని అంశాలకు గతంలో మాదిరిగా త్రిసభ్య కమిటీ వేసుకోవాలని ఆలోచన చేసినట్లుగా సమాచారం. ఇరు రాష్ట్ర రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాల పైన కూడా భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత గవర్నర్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు కేసీఆర్,జగన్ హాజరయ్యారు.