
రాష్ట్ర అవతరణ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2వ తేదీ నుంచి 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలు జరుగుతాయని సీఎం తెలిపారు.
పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తొమ్మిదేండ్ల అనతికాలంలోనే దేశానికే ఆదర్శంగా పాలన కొనసాగిస్తూ, పదవ వసంతంలోకి అడుగుపెడుతున్న చారిత్రక సందర్భంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా, ఘనంగా జరుపుకోవాలని కేసీఆర్ తెలిపారు.
దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా..తెలంగాణ ఘనకీర్తి దశ దిశలా చాటేలా ప్రతి హృదయం ఉప్పొంగేలా పండుగ వాతావరణంలో నిర్వహించాలని సీఎం సూచించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర రాజధాని హైద్రాబాద్ వరకు దశాబ్ది ఉత్సవాలు జరపాలన్నారు. సచివాలయంలో తొలి రోజు ఉత్సవాలు ప్రారంభమవుతాయని.. అదే రోజు రాష్ట్ర మంత్రులు ఆయా జిల్లా కేంద్రాల్లో ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపట్టాలన్నారు.