
జమ్మికుంట, వెలుగు: అందరినీ కలుపుకొని పోవాలని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి సీఎం కేసీఆర్ క్లాస్ పీకారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వర్‌రావుతో పాటు పలువురు నేతలు శనివారం వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చిన కేసీఆర్‌ను కలిసి బోకే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డితో సీఎం కేసీఆర్‘ఏయ్కౌశిక్.. హుజూరాబాద్‌లో అందరినీ కలుపుకపో.. ప్రజల మన్నలను పొందు’ అంటూ క్లాస్ తీసుకున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక తర్వాత కౌశిక్ రెడ్డి, హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్ యాదవ్మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష పార్టీల నేతలపై ఆయన వాడే భాషను టీఆర్ఎస్లీడర్లే తప్పుబడుతున్నారు. కొత్త పెన్షన్ల పంపిణీకి సంబంధించి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో సభలు నిర్వహించిన కౌశిక్ రెడ్డి ఎక్కడా గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను ఆహ్వానించలేదు. ఈ పరిణామాలపై శ్రీనివాస్‌యాదవ్ తన అసంతృప్తిని పలు సందర్భాల్లో బహిరంగంగానే వ్యక్తం చేశారు. ఆ వ్యవహారం గురించి ఇంటలిజెన్స్రిపోర్ట్లు రావడంతోనే కౌశిక్‌రెడ్డిపై సీఎం సీరియస్ అయినట్టు తెలుస్తోంది.