మనీష్ సిసోడియా అరెస్ట్పై స్పందించిన కేసీఆర్

మనీష్ సిసోడియా అరెస్ట్పై స్పందించిన కేసీఆర్

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ ను  సీఎం కేసీఆర్ ఖండించారు.  ప్రధాని మోడీ -అదానీ మధ్య ఉన్న అనుభందం నుంచి  ప్రజల మైండ్ ను  డైవర్ట్ చేయడానికే సిసోడియాను అరెస్ట్ చేశారని విమర్శించారు. 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆదివారం అరెస్టయిన  మనీష్ సిసోడియాను సీబీఐ అధికారులు ఇవాళ రౌస్ ఎవెన్యూ కోర్టులో ప్రవేశ పెట్టగా ఐదు రోజుల కస్టడీకి అప్పగించింది. ఈ నెల 28 నుంచి మార్చి 4 వరకు సీబీఐ కస్టడీకి అప్పగించింది.   

లిక్కర్ స్కాంలో  మనీష్ సిసోడియాను సీబీఐ అధికారులు  గతంలో  కూడా   విచారించారు. ఈ కేసులో  రెండో చార్జీషీట్ ను  సీబీఐ ఇప్పటికే  కోర్టుకు సమర్పించింది.  రెండో చార్జీషీట్ లో  ఢిల్లీ సీఎం  అరవింద్ కేజ్రీవాల్,  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కవిత, మనీష్ సిసోడియా పేర్లు ఉన్న సంగతి తెలిసిందే.